Gold Rate Today: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. మళ్లీ ఆకాశాన్నంటుతున్న ధరలు
Gold Rate Today: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల వల్ల రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.
Gold Rate Today
Gold Rate Today: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొనుగోలుదారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇటీవల కొంత ఊరట లభించినప్పటికీ, పసిడి మళ్లీ సరికొత్త రికార్డుల వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.60 లక్షల మార్కుకు చేరువ కావడంతో పసిడి ప్రియులు, ఆభరణాల కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా మేలిమి బంగారం రేట్లు క్రమంగా పెరుగుతూ రికార్డు స్థాయులను తాకుతున్నాయి. కొన్ని రోజుల కిందట రూ.1.50 లక్షల దిగువన కొనసాగిన తులం పసిడి, ఇప్పుడు భారీగా పుంజుకుని రూ.1.60 లక్షల గీతను తాకేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5న నమోదు అయిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 వద్ద కొనుగోళ్లలో ఉంది. ఇది బులియన్ మార్కెట్లో కొనుగోలుదారుల లెక్కలను తలకిందులు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో పసిడి రేట్లు ఒకే స్థాయిలో కొసాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,56,670 వద్ద నమోదు కాగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,610 వద్ద ఉంది. వివాహాలు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ తరహా గరిష్ఠ ధరలు సామాన్యుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర మహానగరాల్లోనూ పసిడి మెరుపులు తగ్గడం లేదు. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,820 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,43,760 గాను నమోదు అయింది. ఆర్థిక రాజధాని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లోనూ 24 క్యారెట్ల ధర రూ.1,56,670 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,43,610 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ నగరాల్లో ఈ సవరణలు జరుగుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్
అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక పరిణామాలు గ్లోబల్ మార్కెట్లో బంగారం రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఔన్సు గోల్డ్ ధర 4,474 డాలర్ల వద్ద విక్రయమవుతోంది. గ్లోబల్ ట్రెండ్స్ నేరుగా దేశీయ విపణిపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు వెండి ధరలు శనివారం స్థిరంగా ముగిశాయి. గురువారం కేజీ వెండిపై రూ.5,000 పెరగ్గా, శుక్రవారం ఎటువంటి మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం శనివారం నాడు కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.




