Gold Rate Today: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. దిగొస్తున్న బంగారం ధరలు.. నేడు ఎంతంటే ?
Gold Rate Today: గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
gold
Gold Rate Today: పసిడి కొనుగోలుదారులకు ఊరటనిచ్చే వార్త. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. శనివారం నాటి నుంచే పతనం ప్రారంభం కాగా, ఆదివారం కూడా పసిడి రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువ బలోపేతం కావడం పసిడి రేట్ల పతనానికి కారణమవుతున్నాయి. ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య రగులుతున్న తీవ్ర ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ పరిణామాల మధ్య విదేశీ మార్కెట్లలో రేట్లు స్థిరంగా ఉండటంతో మన దేశంలోనూ పసిడి రేట్లు దిగొచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు
సెప్టెంబర్ 13 ఆదివారం నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,580 వద్ద ట్రేడవుతోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,700 వద్ద కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఏపీలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల రేటు రూ.1,54,580 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,700 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్ల తీరు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,54,730 వద్ద ట్రేడవుతోంది. అక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,41,700 గా నమోదైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద సాగుతుండగా, 22 క్యారెట్ల రేటు రూ.1,41,700 గా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో ధరల ఊగిసలాట కొనసాగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు గమనించాల్సి ఉంది.
మార్కెట్‌లో వెండి ప్రయాణం
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెద్దగా పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2.45 లక్షల వద్ద మార్కెట్‌లో ట్రేడవుతోంది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 2.50 లక్షల వద్ద వద్ద స్థిరంగా ముగిసింది. మునుపటి రోజులతో పోలిస్తే వెండి రేట్లలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడం గమనార్హం.




