Gold Price Today: కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గి, బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి.

Naresh.k
Published on: 17 Jun 2026 8:56 AM IST
Gold Price Today
X

Gold Price Today: కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం కొనాలంటేనే భయపడిపోతున్న సామాన్యులకు ఎట్టకేలకు ఒక మంచి శుభవార్త అందింది. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకానొక దశలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో.. రూ. లక్ష లోపు ఉన్న బంగారం ధర ఏకంగా ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో రూ.2 లక్షల మార్కుకు చేరువన నిలిచింది.

అయితే, తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం పసిడి ప్రియులకు కొండంత ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. దీని ప్రభావం నేరుగా బంగారం, వెండి మార్కెట్లపై పడటంతో ధరలు దిగివస్తున్నాయి.

నిన్నటితో పోల్చితే ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. భారీ పెరుగుదలకు బ్రేక్ పడి స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 1,51,360గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,38,740గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,64,900 వద్ద కొనసాగుతోంది.

యుద్ధ భయాలు తొలగిపోవడంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో ఈ తగ్గుదల మధ్యతరగతి ప్రజలకు నిజంగానే పెద్ద ఊరట అని చెప్పాలి.

గమనిక: బంగారం, వెండి ధరలు అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, రూపాయి విలువ ఆధారంగా ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story