Gold Price Today : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Price Today : హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో జూన్ 6న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తోంది.

CR Reddy
Published on: 6 Jun 2026 7:47 AM IST
Gold Price Today
X

Gold Price Today  

Gold Price Today :భారతీయులకు బంగారం అంటే కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఆదుకునే అత్యంత నమ్మకమైన ఆర్థిక భరోసా. గత ఏడాది కాలంగా అస్సలు బ్రేకులు లేకుండా ఆకాశమే హద్దుగా పెరుగుతూ, సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఎట్టకేలకు కొద్దిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన కీలక మార్పుల కారణంగా దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి వినియోగదారులకు, పెట్టుబడిదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

శనివారం (జూన్ 6, 2026) నాటి మార్కెట్ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈ నెలలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. భాగ్యనగరంలో 24 క్యారెట్ల (999 ప్యూర్) 10 గ్రాముల పసిడి ధర రూ.10 మేర తగ్గి రూ.1,57,220 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.1,42,740 వద్ద విక్రయించబడుతోంది. జూన్ ప్రారంభం నుండి పసిడి ధరల గ్రాఫ్ నిరంతరం క్షీణిస్తూ వస్తుండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఎప్పటిలాగే దేశంలోనే అత్యంత ఖరీదైన బంగారం మార్కెట్‌గా నిలిచింది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,950గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,400గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,870గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,520గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం ధరలు హైదరాబాద్‌తో సమానంగా 24 క్యారెట్లకు రూ.1,57,220, 22 క్యారెట్లకు రూ.1,42,740 చొప్పున తులతూగుతున్నాయి.

బంగారంతో పాటే వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.2,79,900గా ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం హైదరాబాద్ కంటే ఏకంగా రూ.5,000 తక్కువగా ఉండడం గమనార్హం. చెన్నై, కేరళలో సైతం ఇవే ధరలు కొనసాగుతుండగా.. ఐటీ హబ్ బెంగళూరులో మాత్రం కేజీ వెండి ధర రూ.2,74,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story