Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా దిగి వస్తున్నాయి.

CR Reddy
Published on: 16 Sept 2026 7:57 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలతో పాటు అమెరికా డాలర్ బలపడటం వంటి పరిణామాలు ఈ విలువైన లోహాల ధరలపై ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్న బులియన్ మార్కెట్‌లో తాజా ట్రేడింగ్ ప్రకారం బంగారం, వెండి ధరలలో తగ్గుదల నమోదు కావడంతో ఆభరణాల ప్రియులకు కాస్త ఊరట లభించినట్లయింది.

మంగళవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్‌లో బంగారం, వెండి ఫ్యూచర్స్ నష్టాలను చవిచూశాయి. అక్టోబర్ 5 గడువు గల గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.494 (0.33%) మేర తగ్గి రూ.1,50,736 వద్ద ట్రేడ్ కాగా, ఇంట్రాడేలో కనిష్టంగా రూ.1,50,650 నుంచి గరిష్టంగా రూ.1,51,553 మధ్య కదిలింది. అలాగే, డిసెంబర్ గడువు గల సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.1,488 (0.64%) క్షీణించి రూ.2,31,202 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,160 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,390, 18 క్యారెట్ల బంగారం రూ.1,14,870 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,53,310, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,540 అలాగే 18 క్యారెట్ల బంగారం రూ.1,15,020గా ఉంది.

ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,160, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,390, 18 క్యారెట్ల బంగారం రూ.1,14,870 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,53,160, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,390 ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,090 వద్ద ఉంది. ఇక వెండి మార్కెట్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కిలో వెండి ధర సుమారు రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.