Stock: లక్షకు రూ.13 లక్షలు తెచ్చిపెట్టిన స్టాక్..100 షేర్లకు 800 షేర్లు ఉచితం

Stock: స్మాల్ క్యాప్ సంస్థ గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ 1:2 స్టాక్ స్ప్లిట్, 3:1 బోనస్ షేర్లను ప్రకటించింది.

Naresh.k
Published on: 18 May 2026 6:57 AM IST
Stock
X

Stock: లక్షకు రూ.13 లక్షలు తెచ్చిపెట్టిన స్టాక్..100 షేర్లకు 800 షేర్లు ఉచితం

Gautam Exim Stock : పేపర్ ఉత్పత్తుల రంగంలో దూసుకుపోతున్న స్మాల్ క్యాప్ సంస్థ గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ తమ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. ఒకేసారి స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్లవర్షం కురిపించబోతోంది. ఈ ఆఫర్ ఎంత భారీగా ఉందంటే.. మీ దగ్గర కేవలం 100 షేర్లు ఉంటే, అవి ఏకంగా 800 షేర్లుగా మారిపోనున్నాయి. కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.

మొదటగా కంపెనీ తన షేర్లను విభజించనుంది. రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ప్రతి 1 ఈక్విటీ షేరు, రూ. 5 ముఖ విలువ కలిగిన 2 షేర్లుగా మారుతుంది. అంటే.. మీ వద్ద ఉన్న 100 షేర్లు కాస్తా మొదట 200 షేర్లు అవుతాయి. స్టాక్ స్ప్లిట్ తర్వాత బోనస్ షేర్ల వంతు వస్తుంది. ఇక్కడ రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న ప్రతి 1 షేరుకు అదనంగా 3 బోనస్ షేర్లను కంపెనీ ఉచితంగా ఇస్తుంది. అంటే.. పైన స్ప్లిట్ ద్వారా వచ్చిన 200 షేర్లకు గాను, ఒక్కో దానికి 3 చొప్పున అదనంగా మరో 600 బోనస్ షేర్లు అందుతాయి. ఫైనల్ లెక్క మొత్తం 800 షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి.

ఈ అదిరిపోయే బెనిఫిట్స్ అందుకోవడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు కంపెనీ మే 22, 2026ని రికార్డు తేదీగా ప్రకటించింది. కాబట్టి, ఈ ఆఫర్ పొందాలనుకునే వారు ఆ తేదీ నాటికి కంపెనీలో వాటాలు కలిగి ఉండాలి. గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ గత కొన్ని ఏళ్లుగా ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తూ వస్తోంది. కేవలం రూ. 96 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ చిన్న కంపెనీ సాధించిన ట్రాక్ రికార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.గత 1 ఏడాదిలో ఏకంగా 150% లాభం. గత 5 ఏళ్లలో నమ్మశక్యం కాని విధంగా 1255% పెరిగింది.ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ ఏకంగా రూ. 13.55 లక్షలు అయ్యేది. చివరి ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు 1.17% లాభంతో రూ. 313.85 వద్ద ముగిసింది. దీని 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 369.50 కాగా, కనిష్ఠ స్థాయి రూ. 121.75 గా ఉంది.

ప్రస్తుతం రూ. 300 పైగా ఉన్న షేరు ధర స్ప్లిట్ ,బోనస్ తర్వాత భారీగా తగ్గుతుంది. దీనివల్ల చిన్న , రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ అందుబాటు ధరలోకి వస్తుంది. మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ పెంచడానికే కంపెనీలు సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. షేర్ల సంఖ్య 8 రెట్లు పెరుగుతుంది కదా అని మీ పెట్టుబడి విలువ 8 రెట్లు పెరిగిపోదు. షేర్ల సంఖ్య పెరిగే కొద్దీ, దానికి అనుగుణంగా మార్కెట్లో షేరు ధర కూడా భారీగా తగ్గుతుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story