Cupid Ltd Stock: అద్భుతం చేసిన స్టాక్.. రూ.5000 పెడితే ఏకంగా రూ.5.50 లక్షలొచ్చాయ్!
Cupid Ltd Stock: స్టాక్ మార్కెట్లో ఓపికకు మించిన పెట్టుబడి లేదు అనడానికి క్యుపిడ్ లిమిటెడ్ షేరే నిదర్శనం.
Cupid Ltd Stock: అద్భుతం చేసిన స్టాక్.. రూ.5000 పెడితే ఏకంగా రూ.5.50 లక్షలొచ్చాయ్!
Cupid Ltd Share Price: స్టాక్ మార్కెట్లో ఒక అద్భుతమైన సామెత ఉంది.. డబ్బులు సంపాదించడం అనేది నిరంతరం ట్రేడింగ్ చేయడంలో లేదు.. సరైన స్టాక్‌ను ఎంచుకుని వేచి చూడడంలోనే ఉంటుంది. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ, ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంగా మారింది ఫార్మా, కన్స్సూమర్ గూడ్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ 'క్యుపిడ్ లిమిటెడ్'. గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఇటీవల సమిర్ నందన్ అనే ఒక ట్రేడర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. స్టాక్ మార్కెట్లో ఓపికగా ఉండడం వల్ల ఎంతటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆయన తన సొంత అనుభవంతో వివరించారు.
సమిర్ నందన్ తన పోస్టులో.. రూ. 5,000 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ. 5,50,000 పైగా మారింది. ఈ మార్కెట్ ఆట మొత్తం పూర్తిగా ఓపిక, సహనానికి సంబంధించింది. ఎవరైతే కంగారుపడకుండా, తమ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘకాలం ప్రాసెస్‌ను నమ్ముతారో.. వారు ఖచ్చితంగా భారీ రిటర్న్స్ అందుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఏ మొత్తమూ చిన్నది కాదు అనడానికి క్యుపిడ్ స్టాక్ ఒక లైవ్ ఉదాహరణ అంటూ రాసుకొచ్చారు. ఆయన కేవలం రూ. 5,425 పెట్టుబడితో ఈ కంపెనీకి చెందిన 2,500 షేర్లు కొనగా.. ఇప్పుడది ఏకంగా 10,071 శాతం పెరిగి రూ. 5,46,400 స్థాయికి చేరుకోవడం విశేషం.
క్యూపిడ్ లిమిటెడ్ షేరు జులై 8వ తేదీన దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో రూ. 224 వద్ద ట్రేడవుతోంది. కేవలం గత వారం రోజుల్లోనే ఈ స్టాక్ 16 శాతం లాభపడగా, గడిచిన నెల రోజుల్లో ఏకంగా 60 శాతం వృద్ధి చెందింది. ఇక ఆరు నెలల కాలంలో ఇన్వెస్టర్లకు 181 శాతం లాభాలను పంచింది. గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే ఏకంగా 940 శాతం లాభాలు ఇచ్చి మల్టీబ్యాగర్‌గా నిలిచింది.
ఇక దీర్ఘకాలికంగా చూసుకుంటే.. ఐదేళ్ల క్రితం కేవలం రూ. 2.43 పైసల వద్ద ఉన్న ఈ షేరు, ఇప్పుడు రూ. 224 స్థాయికి చేరి, సుమారు 9,140 శాతం మేర లాభాలను అందించింది. నిజానికి 2016 లో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టాక్, 2023 డిసెంబర్ వరకు కేవలం రూ. 3 లోపే ట్రేడ్ అవుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మొదలైన బుల్ రన్ ఈ స్టాక్‌ను ఎక్కడో కూర్చోబెట్టింది. ఎవరైతే ఆ ఏడేళ్ల పాటు ఓపికగా వేచి చూశారో.. వారిని ఈ రోజు క్యుపిడ్ లక్ష్మీదేవిలా వరించింది.




