EMI: ఈఎంఐలు తీసుకుంటున్నారా.? అయితే మీ శాలరీలో ఈ రూల్ కచ్చితంగా ఉండాల్సిందే!

EMI: వివిధ రకాల రుణాలు తీసుకునేవారు తమ ఆదాయంలో ఈఎంఐల చెల్లింపునకు సంబంధించి కచ్చితంగా కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 31 July 2026 7:33 PM IST
EMI
X

EMI: ఈఎంఐలు తీసుకుంటున్నారా.? అయితే మీ శాలరీలో ఈ రూల్ కచ్చితంగా ఉండాల్సిందే!

EMI: ప్రస్తుత కాలంలో ఇల్లు, కారు లేదా వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఆదాయానికి మించి లోన్లు తీసుకోవడం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలకు వచ్చే నికర ఆదాయంలో అన్ని రుణాల ఈఎంఐలు కలిపి సుమారు 35 నుండి 40 శాతానికి మించకుండా చూసుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని రకాల లోన్లు తీసుకున్నప్పటికీ తప్పకుండా '40 శాతం ఈఎంఐ నిబంధన'ను పాటించాలని గట్టిగా చెబుతున్నారు.

ఈ పరిమితి దాటితే కుటుంబ పోషణకు అవసరమైన ఇతర ఖర్చులు, భవిష్యత్తు కోసం చేసే పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా అనుకోని వైద్య ఖర్చులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది. కేవలం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇచ్చే అర్హత పరిమితిని మాత్రమే ప్రామాణీకంగా తీసుకోకుండా, మన సొంత చెల్లింపు సామర్థ్యాన్ని బేరీజు వేసుకునే అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

కాగా, క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిన తరుణంలో చాలామంది ఈఎంఐ ఆకర్షణలో పడిపోయి ఆదాయాన్ని పూర్తిగా అప్పుల చెల్లింపులకే వెచ్చిస్తున్నారు. దీనివల్ల నెలవారీ బడ్జెట్ తలకిందులై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రుణం తీసుకునే ముందే రాబడి, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించడం ఎంతో ముఖ్యం. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story