Money: మీ ఇంటి బడ్జెట్‌ను ఇలా ప్లాన్ చేసుకుంటే.. డబ్బుకు అస్సలు లోటు ఉండదు..
Money: కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే మహిళలు ఫైనాన్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి.?
Money: మీ ఇంటి బడ్జెట్‌ను ఇలా ప్లాన్ చేసుకుంటే.. డబ్బుకు అస్సలు లోటు ఉండదు..
Money: గడిచిన పాతిక సంవత్సరాల్లో మహిళల సాధికారత ఎంతో పెరిగింది. నేడు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికి దీటుగా మహిళలు రాణిస్తున్నారు, సంపాదిస్తున్నారు. అయితే, ఒక కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ముందుకు వెళ్లాలంటే కేవలం సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదనను ఎలా మేనేజ్ చేయాలి, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలపై మహిళలకు పూర్తి అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. ఇంట్లో తల్లి లేదా భార్య ఫైనాన్షియల్‌గా లిటరేట్ అయి ఉంటే, ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటుంది.
ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మహిళలు వేయాల్సిన మొదటి అడుగు 'బడ్జెటింగ్'. చాలామంది బడ్జెట్ వేసుకోవడం అంటే ఏదో కష్టమైన లెక్కలు అనుకుంటారు. కానీ అది మన ఆదాయ వ్యయాల లెక్కల పట్టిక మాత్రమే. కుటుంబానికి వచ్చే మొత్తం ఆదాయం ఎంత ఉందో ముందుగా రాసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులను రెండు రకాలుగా విభజించుకోవాలి.
ఫిక్స్‌డ్ ఎక్స్‌పెన్సెస్: ఇంటి అద్దె, ఈఎంఐలు, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులు, స్కూల్ ఫీజులు లాంటివి.
ఇర్రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్: మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వచ్చే ఖర్చులు. ఉదాహరణకు, ఏడాదికి ఇలాంటి ఖర్చులు 60,000 రూపాయలు అవుతుంటే, దాన్ని 12 నెలలతో భాగించి, నెలకు 5,000 రూపాయలు పక్కన పెట్టాలి. ఇలా పక్కాగా బడ్జెట్ వేసుకుంటే అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట పడుతుంది.
కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిరోజూ దీని గురించి కూర్చుని చర్చించాల్సిన పనిలేదు. వారానికోసారి, ఆదివారం డిన్నర్ సమయంలో ఒక 20 నిమిషాలు ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. అలాగే, పెట్టుబడుల గురించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరికొకరు కచ్చితంగా చెప్పుకోవాలి. ఒకవేళ భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకిస్తే, దాన్ని పర్సనల్‌గా తీసుకోకూడదు. అపోజ్ చేస్తున్నారు అంటే అందులో ఏదైనా మనం చూడని పాయింట్ వాళ్ళు చూసి ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్, డిస్అగ్రీమెంట్స్ ఉండటం ఆరోగ్యకరమే. వాటి ద్వారానే ఒక మంచి నిర్ణయానికి రాగలం అని ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ సూచించారు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, రోజువారీగా కాకుండా ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. మహిళలు కేవలం సంపాదించడమే కాదు, పొదుపు, పెట్టుబడులపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటే వారి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎంతో మంచిగా ఉంటుందని అన్నారు.




