Elon Musk: ఎలాన్ మస్క్ రోజు సంపాదన ఎంతో తెలిస్తే కుప్పకూలిపోతారు..!

Elon Musk: జులై 2025 నుండి 2026 మధ్య ఎలాన్ మస్క్ ఆస్తి రోజుకు సగటున రూ.8,300 కోట్లు పెరిగింది.

Naresh.k
Published on: 11 Aug 2026 12:06 PM IST
Elon Musk
X

Elon Musk: ఎలాన్ మస్క్ రోజు సంపాదన ఎంతో తెలిస్తే కుప్పకూలిపోతారు..!

Elon Musk daily income: ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు రోజుకు వెయ్యి, రెండు వేల రూపాయలు సంపాదించడానికి చెమటోడుస్తున్నారు. అలాంటిది, ఏకంగా ఒక్క రోజుకు సగటున రూ.8,300 కోట్లు సంపాదిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే వింతగా అనిపించినా, ఇది అక్షరాలా నిజం. టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో సృష్టించిన సంపద సునామీ ఇది.

జులై 2025 నుండి జులై 2026 మధ్య కాలంలో ఎలాన్ మస్క్ సంపద ఏకంగా రూ.30 లక్షల కోట్లు పెరిగినట్లు బెస్ట్ బ్రోకర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది పొడవునా లెక్కలేస్తే, మస్క్ ప్రతిరోజూ సగటున రూ.8,300 కోట్లు సంపాదించారు. 2026 జూన్ 12న స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వేళ, మస్క్ ఆస్తుల విలువ ఏకంగా రూ.95 లక్షల కోట్లకు పైగా దాటిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత తొలి ట్రిలియనీర్‌గా ఆయన చరిత్రకెక్కారు.

అయితే, ఈ మైలురాయి ఎక్కువ కాలం నిలవలేదు. గత నెలలో స్పేస్ ఎక్స్ షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో మస్క్ ఆస్తి రూ.690 బిలియన్ డాలర్లకు పడిపోయి, ట్రిలియనీర్ హోదాను తాత్కాలికంగా కోల్పోయారు. కానీ, విజేతలు ఎప్పుడూ వెనకబడి ఉండరు. ఇటీవల షేర్లు మళ్లీ 11.7 శాతం పుంజుకోవడంతో, ఆయన నికర ఆస్తి ప్రస్తుతం 725.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హోదా మారినా, ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన అగ్రస్థానం మాత్రం చెక్కుచెదరలేదు.

గడిచిన ఏడాది కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాధించిన వేగవంతమైన వృద్ధి ప్రపంచ పారిశ్రామికవేత్తలకు కాసుల వర్షం కురిపించింది. డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ సంపద $107.6 బిలియన్లు పెరిగి మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. డీప్ సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ సంపద $39.5 బిలియన్లు పెరగడంతో ఆయన ప్రపంచ టాప్-50 ధనవంతుల జాబితాలోకి దూసుకొచ్చారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story