Debt: అప్పు ఇచ్చి రిలేషన్ ఎండ్ చేసుకోవద్దు.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల కీలక సలహాలు.!

Debt: స్నేహితులు అలాగే బంధువులకు డబ్బులు అప్పుగా ఇవ్వడం వల్ల బంధాలు ఎలా చెడిపోతాయో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సాయికృష్ణ స్పష్టం చేశారు.

Ravi
By Ravi
Published on: 28 July 2026 9:20 PM IST
Debt
X

: అప్పు ఇచ్చి రిలేషన్ ఎండ్ చేసుకోవద్దు.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల కీలక సలహాలు.!

Debt: జీవితంలో డబ్బు అవసరం పడినప్పుడు స్నేహితులు, బంధువులు లేదా తెలిసిన వారిని ఆశ్రయించడం చాలా సాధారణమైన విషయం. అయితే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే, భవిష్యత్తులో తీవ్రమైన మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సాయికృష్ణ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ వేదికగా ఈ అంశంపై చాలా స్పష్టంగా మాట్లాడారు. స్నేహితులు, బంధువులు అలాగే తెలిసిన వారికి అప్పు ఇవ్వడం చాలా పెద్ద తప్పు అని ఆయన గట్టిగా పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకముందు ఉన్న మంచి బంధం లేదా రిలేషన్, అప్పు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేసినప్పుడు సమస్యలు మొదలవుతాయి. తిరిగి డబ్బులు అడగడానికి ఫోన్ చేసినప్పుడు లేదా సాధారణంగా ఫోన్ చేసినా సదరు వ్యక్తులు కాల్స్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇష్టపడరని సాయికృష్ణ వివరించారు. దీనివల్ల ఇద్దరి మధ్య ఉన్న మంచి పరిచయం కాస్తా చెడిపోయి శాశ్వతంగా బంధాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిదని ఆయన సలహా ఇచ్చారు. మీతో ఉన్న రిలేషన్‌షిప్ ఎండ్ కాకుండా కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటే మాత్రం ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వవద్దని ఆయన సూచించారు.

కాగా, ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా స్పష్టంగా ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎవరికైనా అత్యవసర సహాయం చేయాల్సి వస్తే, తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న మొత్తాన్ని మాత్రమే ఇవ్వాలని ఆర్థిక సలహాదారులు పేర్కొంటున్నారు. స్నేహం లేదా బంధుత్వాన్ని కాపాడుకోవడానికి డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండటమే అత్యంత సురక్షితమైన మార్గమని దీని ద్వారా స్పష్టమవుతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story