Multibagger: లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్.. న్వెస్టర్లకు కాసుల వర్షం!
Multibagger: సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ షేరు కేవలం 9 ఏళ్లలో 12,940% అద్భుతమైన లాభాలను అందించింది.
Multibagger: లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్.. న్వెస్టర్లకు కాసుల వర్షం!
Cian Agro Industries: స్టాక్ మార్కెట్లో ఓపిక ఉంటే సంపద ఎలా సృష్టింపబడుతుందో చెప్పడానికి ఈ కంపెనీ ఒక నిదర్శనం. ఎఫ్ఎంసీజీ రంగంలోని ఒక చిన్న కంపెనీ, ఇన్వెస్టర్ల పాలిట అక్షయపాత్రగా మారింది. కేవలం తొమ్మిదేళ్లలోనే ఈ స్టాక్ ఏకంగా 12,940 శాతం లాభాన్ని అందించి మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. అదే సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.
రూ. 12 నుంచి రూ. 1600 కి ప్రయాణం
తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేరు విలువ కేవలం రూ. 12.50 మాత్రమే. కానీ నేడు అది రూ. 1630 స్థాయికి చేరుకుంది. తొమ్మిదేళ్ల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ ఏకంగా రూ. 1.3 కోట్లు. అంటే ఇన్వెస్టర్ ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారన్నమాట. గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజూ 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. గత వారం రోజుల్లో 22% లాభం చేకూరింది. గత నెల రోజుల్లో ఏకంగా 129% మేర పెరిగి ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేసింది. 52 వారాల గరిష్ఠం రూ. 3,633.15 కాగా, ప్రస్తుతం రికవరీ బాటలో రూ. 1629.75 వద్ద ట్రేడవుతోంది.
ఏం చేస్తుంది ఈ కంపెనీ?
1985లో నాగ్‌పూర్ కేంద్రంగా ప్రారంభమైన సియాన్ ఆగ్రో, నేడు ఇంటిగ్రేటెడ్ ఎఫ్ఎంసీజీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో బలమైన ముద్ర వేసింది. వంట నూనెలు , సుగంధ ద్రవ్యాలు , ఇథనాల్, బయో ఫెర్టిలైజర్స్. కేవలం అగ్రో రంగమే కాకుండా హెల్త్‌కేర్ సెక్టార్‌లోనూ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 4,560 కోట్లు. ఇలాంటి మల్టీబ్యాగర్ లాభాలు చూసినప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే ఉత్సాహం కలగడం సహజం. అయితే, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది.




