Petrol and Diesel Prices: లీటర్ పెట్రోల్ రూ. 2.25.. డీజిల్ కేవలం 39 పైసలే! ఎక్కడో తెలుసా?

Petrol and Diesel Prices: ప్రపంచంలో అత్యంత తక్కువ మరియు ఎక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న దేశాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 8 May 2026 2:35 PM IST
Petrol and Diesel Prices
X

Petrol and Diesel Prices: లీటర్ పెట్రోల్ రూ. 2.25.. డీజిల్ కేవలం 39 పైసలే! ఎక్కడో తెలుసా?

Petrol and Diesel Prices: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను గమనిస్తే దేశాల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం లభిస్తుంటే, మరికొన్ని దేశాల్లో సామాన్యులకు అందనంత భారంగా మారుతోంది. మన దేశంతో పోలిస్తే కొన్ని చోట్ల ధరలు 44 రెట్లు తక్కువగా ఉంటే, మరికొన్ని చోట్ల 4 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

అత్యంత చౌకైన పెట్రోల్ లభించే దేశాలు (Top 10):

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే పెట్రోల్ విక్రయిస్తున్న దేశాల్లో లిబియా అగ్రస్థానంలో ఉంది.

లిబియా: రూ. 2.25

ఇరాన్: రూ. 3.32

అంగోలా, కువైట్, అల్జీరియా, తుర్క్‌మెనిస్తాన్: రూ. 31.08

ఈజిప్ట్: రూ. 42.78

ఖతార్: రూ. 54.62

సౌదీ అరేబియా: రూ. 59.62

అత్యంత ఖరీదైన పెట్రోల్ ఎక్కడంటే?

చమురు ధరలు చుక్కలు చూపిస్తున్న దేశాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ. 400 పలుకుతోంది.

హాంకాంగ్: రూ. 400

మలావి: రూ. 364.27

ఇజ్రాయెల్: రూ. 269.19

డెన్మార్క్: రూ. 265.74

సింగపూర్: రూ. 230.02

డీజిల్ ధరలు: పైసల్లోనే లీటర్ డీజిల్!

డీజిల్ ధరల విషయానికి వస్తే వెనిజులా రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ లీటర్ డీజిల్ ధర కేవలం 39 పైసలు మాత్రమే.

వెనిజులా: 0.39 పైసలు

ఇరాన్: 0.54 పైసలు

లిబియా: రూ. 2.25

సౌదీ అరేబియా: రూ. 45.37

హాంకాంగ్ (అత్యంత ఖరీదైనది): రూ. 446 (లీటర్)

అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నులు ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి లేకపోవడం వల్ల ధరలు ఎక్కువగా ఉండగా.. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న దేశాల్లో ప్రభుత్వ రాయితీల వల్ల ధరలు అత్యల్పంగా ఉంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story