Recharge plan: రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. మే 31 వరకు మాత్రమే అవకాశం
Recharge plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Recharge plan: రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. మే 31 వరకు మాత్రమే అవకాశం
Recharge plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొత్తగా BSNL నెట్‌వర్క్‌లో చేరే వారికి ఉచిత సిమ్‌తో పాటు డేటా, కాలింగ్, SMS ప్రయోజనాలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతి:
BSNL ప్రకటించిన ఈ ఆఫర్ పూర్తిగా కొత్త వినియోగదారుల కోసం రూపొందించారు. మే 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునే వారికి సిమ్ కార్డు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అందిస్తారు. దీంతో కొత్తగా నెట్‌వర్క్ మార్చాలని భావిస్తున్నవారికి ప్రారంభ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
30 రోజుల పాటు డేటా, కాలింగ్ ప్రయోజనాలు:
ఈ ప్రత్యేక ప్యాకేజీతో వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అదనంగా రోజుకు 100 ఉచిత SMSలు కూడా అందిస్తారు.
మొత్తంగా ఎంత డేటా, ఎన్ని SMSలు లభిస్తాయి?
రోజుకు 2GB చొప్పున 30 రోజుల పాటు వినియోగదారులు మొత్తం 60GB హైస్పీడ్ డేటాను పొందగలరు. అలాగే రోజుకు 100 SMSల చొప్పున మొత్తం 3,000 మెసేజ్ లు పంపే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించే విద్యార్థులు, ఉద్యోగులు, సోషల్ మీడియా వినియోగదారులకు ఈ ప్రయోజనాలు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఆఫర్ పొందాలంటే ఏం చేయాలి?
ఈ స్కీమ్‌ను పొందాలనుకునే వారు తమకు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక రిటైల్ స్టోర్‌ను సందర్శించాలి. అక్కడ కొత్త కనెక్షన్ కోసం అవసరమైన పత్రాలు సమర్పించి సిమ్ తీసుకోవచ్చు. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హత వివరాలు స్థానిక BSNL కేంద్రాల్లో తెలుసుకోవచ్చు.
జియో, ఎయిర్‌టెల్, Vi వద్ద ఇలాంటి ఆఫర్లు ఉన్నాయా.?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త కస్టమర్లకు ఉచిత సిమ్‌తో రోజువారీ డేటా, కాలింగ్, SMS ప్రయోజనాలను కలిపి అందించే ఇలాంటి ప్రత్యేక ఆఫర్‌ను ఇతర నెట్ వర్క్ లు ఏవీ అందించడంలేదు. దీంతో కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో BSNL ముందంజలో నిలిచినట్లు కనిపిస్తోంది.
మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అలాంటి సమయంలో ఉచిత సిమ్‌తో పాటు డేటా, కాలింగ్, SMS ప్రయోజనాలు ఇవ్వడం వినియోగదారులకు అదనపు లాభాన్ని అందించవచ్చు. నెట్‌వర్క్ మార్చాలని భావిస్తున్న వారికిరికి ఇదొక మంచి అవకాశం కానుంది.




