Gold Rate Today: ముహూర్తాల వేళలో పసిడి పరుగులు..రెండోరోజూ పెరిగిన ధరలు

Gold Rate Today: వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా రెండోరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి.

KVD Varma
Published on: 1 April 2026 7:14 AM IST
Gold Rate Today: వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా రెండోరోజూ పెరుగుదల నమోదు చేశాయి
X

Gold Rate Today

Gold Rate Today: వరుసగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ .పైకి కదులుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైన తరువాత వరుసగా బంగారం ధరలు పెరగడం ఇదే మొదటిసారి. మొన్నటి వరకూ తగ్గిన బంగారం ధరలు వరుసగా రెండోరోజూ పెరుగుదల కనబరిచాయి. ఏప్రిల్, మే నెలల్లో వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండడంతో బంగారం ధరల పెరుగుదల సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈరోజు ధరలు ఇలా..

హైదరాబాద్ లో ఈరోజు బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు 1250 రూపాయల పెరుగుదల నమోదు చేసి 1,49,510 రూపాయలకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్లు 10 గ్రాములకు 1150 రూపాయలు పెరిగి 1,37,050 రూపాయల వద్ద ఉంది. నిజానికి నిన్న అంటే మంగళవారం మార్కెట్లు ప్రారంభం అయిన దగ్గర నుంచీ బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. సాయంత్రం వరకూ అదే ట్రెండ్ కొనసాగించాయి. చివరకు భారీ పెరుగుదలతో బంగారం ధరలు నిలిచాయి.

మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,510 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,050 వద్ద ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,49,660 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,200 వద్ద ఉంది. చెన్నైలో మాత్రం హైదరాబాద్ కంటే కొద్దిగా తక్కువగా ధరలు ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,49,130 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,700 వద్ద ఉంది. అలాగే బెంగళూరు విషయానికి వస్తే అక్కడ బంగారం ధరలు హైదరాబాద్ లో లానే ఉన్నాయి.

వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు మాత్రం తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు కాస్త తగ్గాయి. కేజీ వెండికి 5 వేల రూపాయల తగ్గుదల నమోదు అయింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,50,000 రూపాయలు ఉండగా.. ఢిల్లీలో మాత్రం 5 వేళా రూపాయల పెరుగుదలను నమోదు చేసి 2,50,000 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు వరుసగా రెండురోజులు ఢిల్లీలో వెండి ధర 2,45,000 రూపాయల వద్ద కొనసాగింది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగా ఈరోజు అంటే 01 ఏప్రిల్ 2026న బంగారం, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ కు 175 డాలర్లు పెరిగి 4,704.54 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక వెండి కూడా 6 శాతం పెరుగుదల కనబర్చింది. ఔన్స్ కు 74.77 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో ఈరోజు దేశీయంగానూ ఆ ప్రభావం ఉండవచ్చని, మార్కెట్లు తెరిచే సమయానికి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 01.04.2026 ఉదయం 6 గంటల సమయానికి ఉన్నవి. సాధారణంగా బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. మార్కెట్ తెరిచే సమయానికి అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు రావచ్చు. బంగారం, వెండి కొనాలనుకునే ముందు స్థానికంగా వివిధ విక్రేతల వద్ద ధరలను సరిపోల్చుకోవలసినదిగా సూచిస్తున్నాం.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story