Ambuja Cements : దుమ్మురేపిన అంబుజా సిమెంట్స్ ఫలితాలు.. రికార్డు అమ్మకాలు, నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?

Ambuja Cements : అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, ప్రపంచంలోనే 9వ అతిపెద్ద బిల్డింగ్ మెటీరియల్స్ సొల్యూషన్స్ కంపెనీగా

G Krishna
Updated on: 4 May 2026 5:35 PM IST
Ambuja Cements
X

Ambuja Cements

Ambuja Cements : అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, 2026 ఫైనాన్షియల్ ఇయర్ (FY'26) రిజల్ట్స్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపించింది. వరల్డ్స్‌ 9th లార్జెస్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీగా ఉన్న అంబుజా, తన హిస్టరీలోనే హైయెస్ట్ యాన్యువల్ సేల్స్ వాల్యూమ్‌ను నమోదు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. క్యాపిటల్ డిసిప్లిన్ , అసెట్స్ వాడకాన్ని పెంచడం వల్ల ఈ సస్టైనబుల్ గ్రోత్ సాధ్యమైందని కంపెనీ తెలిపింది.

అదిరిపోయే ఫైనాన్షియల్ రిజల్ట్స్, సేల్స్

ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో అంబుజా సిమెంట్స్ టోటల్ 73.7 మిలియన్ టన్నుల (MnT) సేల్స్ వాల్యూమ్‌ను సాధించింది. కేవలం ఫోర్త్ క్వార్టర్ (Q4) లోనే 19.9 MnT సేల్స్ జరిగాయి, ఇది గతేడాదితో పోలిస్తే 10% గ్రోత్. ఇక ఇన్కమ్ విషయానికి వస్తే, యాన్యువల్ రెవెన్యూ రూ. 40,656 కోట్లకు చేరింది. కంపెనీ యాన్యువల్ EBITDA రూ. 6,539 కోట్లుగా నమోదై 31% గ్రోత్ చూపించింది. ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెబుతూ ఒక్కో షేరుపై రూ. 2 డివిడెండ్‌ను కూడా అనౌన్స్ చేసింది కంపెనీ.

మెగా మెర్జర్స్.. కెపాసిటీ ఎక్స్‌పాన్షన్

బిజినెస్‌ను మరింత పెంచేందుకు అంబుజా సిమెంట్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే సాంఘీ (Sanghi) , పెన్నా సిమెంట్ (Penna Cement) విలీన ప్రక్రియను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసింది. వీటితో పాటు ఏసీసీ (ACC) , ఓరియంట్ సిమెంట్ విలీనం కోసం స్టాక్ ఎక్స్ఛేంజీలకు అప్లికేషన్స్ ఇచ్చింది, ప్రస్తుతం సెబీ (SEBI) నుంచి పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ సిమెంట్ కెపాసిటీ 109 MTPA కి చేరగా, దీన్ని త్వరలోనే 119 MTPA కి పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. జోధ్‌పూర్‌లో కొత్త క్లింకరింగ్ లైన్ స్టార్ట్ చేయడం, దహేజ్ దగ్గర కొత్త యూనిట్ ట్రయల్ రన్ మొదలవ్వడం ఈ ప్లాన్‌లో మెయిన్ పార్ట్స్.

స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్.. గ్రీన్ ఎనర్జీ

అంబుజా సిమెంట్స్ ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కంపెనీ ఇప్పటికీ ఎటువంటి అప్పులు లేని (Debt-Free) బ్యాలెన్స్ షీట్‌ను మెయింటైన్ చేస్తోంది. దీని నెట్ వర్త్ రూ. 71,846 కోట్లుగా ఉంది. క్రిసిల్ (CRISIL) , కేర్ (CARE) నుంచి కంపెనీకి AAA / A1+ క్రెడిట్ రేటింగ్స్ వచ్చాయి. పర్యావరణం కోసం గ్రీన్ పవర్ షేర్‌ను 32% కి పెంచింది. 2050 నాటికి నెట్ జీరో టార్గెట్‌తో ముందుకు వెళ్తూ, 1 GW రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అలాగే ఇప్పటివరకు 2.25 మిలియన్ల చెట్లను నాటినట్లు కంపెనీ వెల్లడించింది.

డిజిటలైజేషన్.. ఫ్యూచర్ ఛాలెంజెస్

లేటెస్ట్ టెక్నాలజీ వాడకంలో అంబుజా ముందుంది. 'CiNOC' నెట్‌వర్క్ ద్వారా ఆపరేషన్స్ అన్నింటినీ రియల్ టైమ్‌లో మానిటర్ చేస్తూ ఎఫిషియన్సీ పెంచుతోంది. అయితే వెస్ట్ ఆసియాలో గొడవల వల్ల ఫ్యూయల్, డీజిల్ రేట్లు పెరగడం , రూపాయి వాల్యూ తగ్గడం వంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి లాజిస్టిక్స్ ఖర్చులను కంట్రోల్ చేయడం, గ్రీన్ ఎనర్జీని ఎక్కువగా వాడటం వంటి ప్లాన్స్ చేస్తోంది. వచ్చే ఏడాది సిమెంట్ డిమాండ్ సుమారు 5% వరకు ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story