Amazon Prime Day.. ఫోన్లపై బంపర్ డీల్స్.!
Amazon Prime Day Sale : ఎలక్ట్రానిక్స్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026' (Amazon Prime Day Sale) మరికొద్ది రోజుల్లోనే..
amazon prime day sale 2026 smartphones
Amazon Prime Day Sale : ఎలక్ట్రానిక్స్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026' (Amazon Prime Day Sale) మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూలై 4 నుండి జూలై 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ లైవ్‌లో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, వైర్లెస్ స్పీకర్లు, స్మార్ట్ హోమ్ అప్లియెన్సెస్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే, శనివారం సేల్ ప్రారంభం కావడానికి ముందే 'ప్రైమ్ డే ఎర్లీ డీల్స్' (Early Deals) లైవ్ లోకి వచ్చేసాయంటూ అమెజాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వన్‌ప్లస్, రెడ్మీ, నథింగ్, లావా వంటి పాపులర్ బ్రాండ్ల ఫోన్లపై లభిస్తున్న టాప్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వన్‌ప్లస్, నథింగ్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒక మంచి అవకాశం. వన్‌ప్లస్ గతేడాది లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ మోడల్ వన్‌ప్లస్ 13 (OnePlus 13) అసలు ధర రూ. 72,999 ఉండగా, ఈ సేల్‌లో ఏకంగా రూ. 54,999 కే లభిస్తోంది. అలాగే రూ. 57,999 విలువైన వన్‌ప్లస్ 13s ఫోన్‌ను రూ. 49,999 ల్యాంచ్ ప్రైస్‌కే సొంతం చేసుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద ఆఫర్ నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) పై ఉంది. రూ. 84,999 లిస్టెడ్ ప్రైస్ ఉన్న ఈ ప్రీమియం ఫోన్ సగానికి పైగా తగ్గి, సేల్‌లో కేవలం రూ. 41,999 కే అందుబాటులో ఉంది.
బడ్జెట్ అండ్ మిడ్-రేంజ్ ఫోన్ల ధరలు
ప్రీమియం ఫోన్లతో పాటు బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లపై కూడా అమెజాన్ మంచి తగ్గింపును ఇస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్మీ టర్బో 5 (Redmi Turbo 5) ఫోన్ అసలు ధర రూ. 54,999 కాగా, సేల్‌లో దీనిని రూ. 37,999 కే కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ విభాగంలో రెడ్మీ A7 ప్రో 5G రూ. 13,999 (అసలు ధర రూ. 16,999), లావా బోల్డ్ N2 రూ. 8,999 (అసలు ధర రూ. 9,999) ధరలకే లిస్ట్ అయ్యాయి.
బ్యాంక్ ఆఫర్లతో అదనపు ఆదా
నేరుగా లభించే ప్రైస్ కట్స్‌తో పాటు, కస్టమర్లు తమ పొదుపును మరింత పెంచుకునేందుకు అమెజాన్ అదనపు ఆఫర్లను కూడా ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి తక్షణమే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్ జూలై 4 నుండి అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ప్రైమ్ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందే (ఎర్లీ యాక్సెస్) ఈ డీల్స్ ఓపెన్ అవుతాయి. పైన పేర్కొన్న సేల్ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేదా క్యాష్‌బ్యాక్‌లు ఇంకా కలపలేదని, వాటిని చెక్ అవుట్ సమయంలో వాడుకుంటే ధరలు మరింత తగ్గుతాయని అమెజాన్ స్పష్టం చేసింది.




