AITUC: కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆందోళన!
AITUC: ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఏఐటీయూసీ ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ. ప్రధాన డిమాండ్లు ఇవే.
AITUC: కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆందోళన!
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) ఆందోళన:
AITUC: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి.) ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వినతిపత్రాలు సమర్పించారు.. అందులో భాగంగా తమ డిమాండ్స్ పరిష్కరించాలని వినతిపత్రం అందజేసారు..
డిమాండ్స్:
కనీస వేతనం రూ.26,000/- ఖచ్చితంగా ఇవ్వాలి...సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 4 లేబర్ కోడ్లు రద్దుచేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలి... 8 గంటల పని విధానం అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ వెంటనే ఇవ్వాలి.
కాంట్రాక్ట్ జాబ్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి... స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలి. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. కనీస వేతనాల బోర్డుల్లో, సంక్షేమ బోర్డుల్లో, కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. వివక్షతను అరికట్టాలి. వలస కార్మికులకు రక్షణ కల్పించి, వలస కార్మిక చట్టం అమలు చేయాలి. గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.




