రూ. 10 లక్షల లమ్సమ్ లేదా రూ. 10 వేల సిప్.. 20 ఏళ్లకు ఏది బెటర్.. పూర్తి వివరాలు!
Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టడం మంచిదా? లేక నెలకు రూ. 10 వేల చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేయడం మంచిదా.?
రూ. 10 లక్షల లమ్సమ్ లేదా రూ. 10 వేల సిప్.. 20 ఏళ్లకు ఏది బెటర్.. పూర్తి వివరాలు!
Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది ఇన్వెస్టర్లకు లమ్ సమ్ పెట్టుబడి పెట్టడం మంచిదా, లేక సిప్ ద్వారా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచిదా అనే సందేహం ఉంటుంది. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న రూ. 10 లక్షలను ఒకేసారి పెట్టుబడి పెట్టడం, మరొక వ్యక్తి నెలకు రూ. 10 వేల చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేయడం.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సగటున 12 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనా.. మీరు ఒకేసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, దానిని 20 ఏళ్ల పాటు కదిలించకుండా వదిలేస్తే, కాంపౌండింగ్ ప్రభావంతో ఆ మొత్తం సుమారు రూ. 96.46 లక్షలకు చేరుకుంటుంది. ఇక్కడ మీరు పెట్టిన అసలు రూ. 10 లక్షలే అయినా, దానిపై వచ్చే రాబడి ఏకంగా రూ. 86 లక్షల పైనే ఉంటుంది.
మరోవైపు, మీరు నెలకు రూ. 10 వేలు చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తే.. మీరు పెట్టుబడి పెట్టే మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది. దీనిపై అదే 12 శాతం రాబడి అంచనాతో చూస్తే, 20 ఏళ్ల తర్వాత మీ చేతికి సుమారు రూ. 99.9 లక్షలు అందుతాయి.
దీని బట్టి చూస్తే, రెండు విధానాల్లోనూ దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. మీ వద్ద ఇప్పటికే పెద్ద మొత్తం ఉంటే లమ్ సమ్ విధానం ఉత్తమం, ఇది ఎక్కువ కాలం మార్కెట్లో ఉండి అద్భుతమైన లాభాలను ఇస్తుంది. కానీ, నెలవారీ జీతంపై ఆధారపడే సామాన్యులకు క్రమశిక్షణతో కూడిన సిప్ విధానం ఎంతో లాభదాయకమని, ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల రిస్క్‌ను బాగా తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలను బట్టి వారు సరైన విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం.




