Puttur: పుత్తూరులో నాగుపాము కలకలం!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరులోని పద్మావతి నగర్లో నాగుపాము హల్చల్ చేసింది. పామును రెస్క్యూ టీమ్ సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
Puttur: పుత్తూరులో నాగుపాము కలకలం!
Puttur: పుత్తూరు లోని పద్మావతి నగర్లో ఒక ఇంటి వద్ద వాటర్ ట్యాంక్ కింద నాగుపాము కనిపించడం స్థానికులను భయపెట్టింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ చేరుకుని పామును సురక్షితంగా బయటకు తీశారు.
బండ జరిపేటప్పుడు పాముకు స్వల్ప గాయం కావడంతో పసుపు రాసి, నీళ్లు ఇచ్చారు. ఎండాకాలంలో చల్లని ప్రదేశాల కోసం పాములు ఇళ్లలోకి రావడం సహజమని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పాములు పగ పడతాయన్నది అపోహ మాత్రమేనని తెలిపారు.
Next Story




