Yousufguda: ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. సభ్యుల మధ్య తోపులాట!

Yousufguda: హైదరాబాద్ యూసఫ్‌గూడలోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సభ్యులు ఆందోళనకు దిగారు.

RAJESH,	WEST ZONE
Published on: 5 April 2026 5:29 PM IST
Yousufguda
X

Yousufguda: ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. సభ్యుల మధ్య తోపులాట!

Yousufguda: హైదరాబాద్ ఇంద్రానగర్, యూసఫ్‌గూడలోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయంలో సభ్యులు, కార్యవర్గ సభ్యుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫెడరేషన్ నిధులు దుర్వినియోగం చేసి లెక్కలు చూపించకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముందుగా ఆర్థిక లెక్కలు వెల్లడించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికల తేదీ నిర్ణయించకుండానే కార్యవర్గ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా, యూనియన్ నిధులు దుర్వినియోగం చేశారని శివాజీనగర్‌కు చెందిన సభ్యుడు సుర్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యక్షుడు డి. సీతారాం, కార్యదర్శి మహబూబ్ బేగ్ అలియాస్ ఖదిర్ బాషా, వైస్ ప్రెసిడెంట్ పి. వెంకటేష్‌లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story