Telangana: రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు రాకుండా పారిపోవద్దు రామచందర్ రావు
Telangana: దిల్లీ ధర్నాలో 90% బయటివారేనని, జేపీఎస్సీ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సమాధానం చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
Telangana: రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు రాకుండా పారిపోవద్దు రామచందర్ రావు
Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ,దిల్లీలో కాక్రోచ్ పార్టీ చేసిన ధర్నాలో 90 శాతం బయటి వాళ్లే పాల్గొన్నారు.దేశ వ్యతిరేక నినాదాలు చేశారు,జార్ఖండ్ లో చేస్తున్న నిరసనలో వంద శాతం విద్యార్థులు ఉన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధం లేదు,జార్ఖండ్ లో జరిగే నిరసనలపై రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎందుకు స్పందించడం లేదు,జార్ఖండ్ ప్రభుత్వం స్పందించడం లేదు సీబీఐకి ఇవ్వడం లేదు.
విద్యార్థులు చేయని ఆందోళనకు మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ.. అసలైన విద్యార్థులు చేసే ఆందోళనకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో చెప్పాలి.విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే పార్లమెంట్ కు వస్తానన్న రాహుల్ గాంధీ ఎందుకు రావడం లేదు,రాహుల్ గాంధీ పార్లమెంట్ కు వస్తే హోం మంత్రి అన్నింటికి సమాధానం ఇస్తారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్ కు రాకుండా పారిపోకండి.జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలు లీక్ అవుతే ఇండియా కూటమి ప్రశ్నించడం లేదు.రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీకి రావాలి.రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైందీ,జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది.జార్ఖండ్ విద్యార్థులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇండియా కూటమి వైఖరిని ఖండిస్తోంది.




