IPL: ఐపీఎల్ చ‌రిత్ర‌లో వేగ‌వంత‌మైన 5 సెంచ‌రీలు.. 30 బాల్స్‌లో సెంచ‌రీ కొట్టడం ఏంటి సామీ.

IPL: ఐపీఎల్‌.. ప్రపంచ క్రికెట్‌లో కొత్త సంచలనం తీసుకొచ్చిన టోర్నీగా నిలిచింది. ఈ లీగ్‌లో ప్రతి సీజన్‌లోనూ బ్యాట్స్‌మెన్ తమ దూకుడు ఆటతో అభిమానులను అలరిస్తుంటారు.

Mokshith
Published on: 11 May 2026 11:27 AM IST
IPL
X

 IPL

IPL: ఐపీఎల్‌.. ప్రపంచ క్రికెట్‌లో కొత్త సంచలనం తీసుకొచ్చిన టోర్నీగా నిలిచింది. ఈ లీగ్‌లో ప్రతి సీజన్‌లోనూ బ్యాట్స్‌మెన్ తమ దూకుడు ఆటతో అభిమానులను అలరిస్తుంటారు. ముఖ్యంగా తక్కువ బంతుల్లో సెంచరీలు బాదిన ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిపోయాయి.

టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేయడమే కష్టం. అలాంటిది కేవలం త‌క్కువ‌ బంతుల్లోనే శతకం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు IPL చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ గురించి తెలుసుకుందాం.

క్రిస్ గేల్ – 30 బంతుల్లో సెంచరీ (2013)

క్రిస్ గేల్ పేరు వినగానే విధ్వంసక బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. IPL చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇప్పటికీ గేల్ పేరిటే ఉంది. 2013లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తరఫున ఆడిన గేల్, పుణె వారియ‌ర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. బెంగళూరులోని చిన్న‌స్వామీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. IPL చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గేల్ ఆ రోజు ఆడిన తీరు చూసి బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.

యూసుఫ్ పఠాన్ – 37 బంతుల్లో సెంచరీ (2010)

యూసుఫ్ పఠాన్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తరఫున ఆడిన ప‌ఠాన్ ముంబై ఇండియ‌న్స్‌పై కేవలం 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యూసుఫ్ 8 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. అతని దూకుడు బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అయితే యూసుఫ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, రాజస్థాన్ ఆ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. అయినప్పటికీ ఇది IPLలో అత్యంత గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.

డేవిడ్ మిల్లర్ – 38 బంతుల్లో సెంచరీ (2013)

డేవిడ్ మిల్లర్ ఐపీఎల్‌లో “కిల్లర్ మిల్లర్”గా గుర్తింపు పొందడానికి కారణమైన ఇన్నింగ్స్ ఇదే. 2013లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడిన మిల్లర్, బెంళూరుపై 38 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మిల్లర్ అజేయంగా 101 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతని అద్భుత బ్యాటింగ్‌తో పంజాబ్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని సులభంగా చేధించింది.

అడమ్ గిల్‌క్రిస్ట్ – 42 బంతుల్లో సెంచరీ (2008)

అడమ్ గిల్‌క్రిస్ట్ దూకుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. IPL తొలి సీజన్ అయిన 2008లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్ తరఫున ఆడుతూ ముంబై ఇండియ‌న్స్‌పై కేవలం 42 బంతుల్లో సెంచరీ చేశాడు. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ 109 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. గిల్‌క్రిస్ట్ ఆ రోజు ఆడిన దూకుడు ఇన్నింగ్స్‌తో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. అతని ఇన్నింగ్స్ సహాయంతో డెక్కన్ ఛార్జర్స్ సులభంగా విజయం సాధించింది.

ఏబీ డివిలియర్స్ – 43 బంతుల్లో సెంచరీ (2016)

ఏబీ డివిలియర్స్‌ను “మిస్టర్ 360” అని ఎందుకు పిలుస్తారో ఈ ఇన్నింగ్స్ చూపించింది. 2016లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తరఫున ఆడిన డివిలియర్స్, గుజ‌రాత్ ల‌య‌న్స్‌పై కేవలం 43 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను మొత్తం 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. మైదానం నలుమూలలా వినూత్న షాట్లు ఆడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story