Tirumala temple mystery: తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆవిర్భావం... ఆనందనిలయం వెనుక ఈ చిన్ని రంధ్రాన్ని మీరెప్పుడైనా గమనించారా?
Tirumala temple mystery: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనంతమైన మహిమల నిలయం. ఏడుకొండల వాడి చెంత జరిగే ప్రతి కైంకర్యం వెనుక ఓ దివ్యమైన రహస్యం దాగి ఉంటుంది.
Tirumala temple mystery: తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆవిర్భావం... ఆనందనిలయం వెనుక ఈ చిన్ని రంధ్రాన్ని మీరెప్పుడైనా గమనించారా?
Tirumala Temple Mystery: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనంతమైన మహిమల నిలయం. ఏడుకొండల వాడి చెంత జరిగే ప్రతి కైంకర్యం వెనుక ఓ దివ్యమైన రహస్యం దాగి ఉంటుంది. స్వామివారు శ్రీవేంకటేశ్వరునిగా ఆనందనిలయంలో ఎలా జరిగిందనే సంఘటన నేటికీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారి ఆవిర్భావానికి, ఆనందనిలయంలో గోడ దిగువభాగంలో ఉన్న చిన్ని రంధ్రానికి అవినాభావ సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోనేటిరాయుడు ఎవరు
తిరుమలలోని ఆనందనిలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు ఎవరు అన్న సందేహానికి శతాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఒక అద్భుతమే సమాధానమైంది. ఈ సంఘటన భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం, తిరుమలలో స్వామివారికి ఉదయం పూజలు మాత్రమే జరిగేవి. ఆ సమయంలో ఆలయంలో ఉన్న స్వయంభూ విగ్రహం ఎవరిది అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైష్ణవులు శ్రీమహావిష్ణువే అని, శైవులు పరమశివుడని, మరికొందరు శక్తిరూపిణి అమ్మవారిదని వాదించారు. ఈ వివాదానికి ముగింపు కావాలని అందరూ కలిసి రామానుజాచార్యుల ఆశ్రయానికి వెళ్లారు.
రామానుజులు ఒక సరళమైన కానీ గంభీరమైన పరిష్కారం సూచించారు. ఆనందనిలయాన్ని శుభ్రం చేసిన తరువాత వెనుక భాగంలో ఉన్న చిన్న తూము వద్ద శంఖం, చక్రం.. అలాగే శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ఉంచారు ఉంచాలని చెప్పారు. మరుసటి రోజు ఆలయం తలుపులు తెరిచినప్పుడు అవి స్వామివారి భుజాలపై కనిపిస్తే, ఆయన శ్రీమన్నారాయణుడేనని భావించాలని సూచించారు.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిర్భావం
రామానుజులు చెప్పిన విధంగానే ఆనందనిలయం గోడ కిందిభాగంలో ఉన్న రంధ్రం వద్ద శంఖ చక్రాలను, త్రిశూలాన్ని ఉంచారు. అనంతరం గర్భాలయం తలుపులు మూసేసి వెళ్లిపోయారు. మరుసటి ఉదయం జరిగిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గర్భాలయంలోని మూలమూర్తి భుజాలపై అత్యంత శోభాయమానంగా అమరి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు, పండితులు పరమానందభరితులయ్యారు.
ఆదిశేషుని లీల
ఈ అద్భుతం వెనుక ఒక రహస్యం ఉందని పెద్దలు చెబుతారు. శేషశయనుడైన విష్ణువు కోసం, ఆదిశేషుడు పాము రూపంలో ఆ చిన్ని తూము ద్వారా లోపలికి ప్రవేశించి, ఆ శంఖచక్రాలను స్వామివారికి అలంకరించారని ప్రతీతి. ఈ విజయానికి గుర్తుగా ఆ తూమును మూసివేసి, దానిపై రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. నేటికీ మనం ఆనందనిలయం వెనుక రామానుజుల వారిని దర్శించుకోవచ్చు.
ప్రతి ఏడాది కోట్లాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనం తరువాత ఆనందనిలయాన్ని ప్రదక్షిణ చేసేటస్పుడు వెనుకభాగంలో తూము వద్ద ప్రతిష్టించిన రామానుజులవారిని కూడా దర్శించుకుంటే, మనలోని సందేహాలన్నీ తొలగి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం కథ కాదు, కలియుగ దైవం మనకు అనుగ్రహించిన నిదర్శనం.




