Yamaha R2 : R15కు అన్నయ్య వచ్చేశాడు.. Yamaha R2 రెడీ.!

Yamaha R2 : భారత టూ-వీలర్ మార్కెట్లో స్పోర్ట్స్ బైక్ ప్రియులకు యమహా (Yamaha) కంపెనీ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశీయ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన

G Krishna
Published on: 4 July 2026 12:59 PM IST
yamaha r2
X

yamaha r2

Yamaha R2 : భారత టూ-వీలర్ మార్కెట్లో స్పోర్ట్స్ బైక్ ప్రియులకు యమహా (Yamaha) కంపెనీ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశీయ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన 'R15' బైక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా.. మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో సరికొత్త ‘యమహా YZF-R2’ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ, ఆగస్టు 27న ఈ బైక్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ పంపిన ఒక మీడియా ఇన్విటేషన్ ద్వారా తెలుస్తోంది.

200cc పవర్‌ఫుల్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్

నూతన యమహా R2 బైక్ సుమారు 200cc లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న R15 బైక్ 155cc ఇంజిన్‌తో 18.4hp పవర్, 14.2Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు రాబోతున్న R2 మోడల్‌లో డిస్‌ప్లేస్‌మెంట్ పెరగడం వల్ల పర్ఫార్మెన్స్, పికప్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా, యమహా బైకులకు ఉండే ప్రధాన ప్లస్ పాయింట్ 'మైలేజ్' (Fuel Efficiency) విషయంలో కూడా ఈ బైక్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యమహా కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్

భారత మార్కెట్లో యమహా R3 బైక్ నిలిపివేయబడిన (Discontinued) నేపథ్యంలో, ఇప్పుడు రాబోతున్న YZF-R2 బైక్ భారతదేశంలో యమహా కంపెనీకి 'ఫ్లాగ్‌షిప్' (టాప్-ఎండ్) మోడల్‌గా మారే అవకాశం ఉంది. ఈ సరికొత్త R2 మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న R15, MT-15, , XSR155 బైక్‌ల అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ కొత్త బైక్ ఏ పాత మోడల్‌ను రీప్లేస్ చేయడం లేదు.

మేడ్ ఇన్ ఇండియా.. గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్

ఈ యమహా R2 బైక్‌ను పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. చెన్నైలోని యమహా ప్లాంట్‌లో ఈ బైక్‌ను పూర్తిగా తయారీ (Manufactured) చేయనున్నారు. ఇక్కడి నుండి భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ బైక్‌ను ఎగుమతి (Export) చేయాలని యమహా ప్లాన్ చేస్తోంది.

పోటీ , ధర అంచనా

మార్కెట్లోకి అడుగుపెట్టాక యమహా R2 బైక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఆర్ ఆర్సీ 200 (KTM RC 200 - ధర రూ. 2.24 లక్షలు), హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్ఆర్ 210 (Hero Karizma XMR 210 - ధర రూ. 1.88 లక్షలు) బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. వీటితో పాటు యమహా కంపెనీ 'NMax 155' అనే మ్యాక్సీ-స్కూటర్‌ను కూడా ఇండియాకు తీసుకురావడానికి డిజైన్ పేటెంట్ ఫైల్ చేసింది. అయితే, ఆ స్కూటర్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story