ఫోటోగ్రఫీ ప్రియులకు పండగే.. ట్రిఫుల్ కెమెరా సెటప్‌తోనే పిచ్చెక్కిస్తోన్న వివో కొత్త ఫోన్..!

Vivo X300e Launch: మొత్తంగా పరిశీలిస్తే జైస్ ట్యూనింగ్ కెమెరాలు, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ లాంటి స్పెసిఫికేషన్లతో వివో X300e మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు రెడీగా ఉంది.

Venkat
Published on: 28 July 2026 11:13 AM IST
Vivo X300e Launch
X

ఫోటోగ్రఫీ ప్రియులకు పండగే.. ట్రిఫుల్ కెమెరా సెటప్‌తోనే పిచ్చెక్కిస్తోన్న వివో కొత్త ఫోన్..!

Vivo X300e Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మోస్ట్ అవైటెడ్ మోడల్ ‘వివో X300e (Vivo X300e)’ చైనా మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఎన్నో రోజులుగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న లీక్స్‌కు తెరదించుతూ.. కళ్లు చెదిరే డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, కొండంత బ్యాటరీతో కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ నయా ఫోన్ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. ఆకర్షణీయమైన డిజైన్..

సరికొత్త వివో X300e డిస్‌ప్లే ఫీచర్లు టెక్ ప్రియులను అబ్బురపరుస్తున్నాయి. ఇందులో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌ను అమర్చారు. 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ ఉండటం వల్ల హై క్వాలిటీ వీడియోలు చూసినా, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ ఆడినా కళ్లకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఎంతో సౌకర్యంగా ఉండేలా ఈ స్మార్ట్‌ఫోన్ మందాన్ని కేవలం 7.99 మిల్లీమీటర్లకు పరిమితం చేశారు.

బరువు విషయానికొస్తే 203 గ్రాములుగా కంపెనీ వెల్లడించింది. యూజర్ల భద్రతను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివో.. ఫోన్ డిస్‌ప్లేలోనే అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించింది. కస్టమర్ల అభిరుచులకు, మోడ్రన్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా మూన్‌లైట్ వైట్, సన్‌లైట్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రావడం విశేషం.

ప్రాసెసర్‌తో పాటు అదుర్స్ అనిపించే పెర్ఫార్మెన్స్..

హెవీ మల్టీటాస్కింగ్ చేసేవారికి, గేమింగ్ లవర్స్‌కు ఈ డివైజ్ ఒక పవర్‌హౌస్ లాంటిది. ఇందులో క్వాల్కమ్ తయారు చేసిన అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 5 (Snapdragon 8 Gen 5) ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.8GHz ఫ్రీక్వెన్సీ స్పీడ్‌తో పనిచేస్తుంది.

కాబట్టి యాప్స్ ఎంత వేగంగా మార్చినా ఎక్కడా ల్యాగ్ అయ్యే సమస్యే ఎదురుకాదు. దీనికి జతగా అడ్వాన్స్‌డ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ కోసం UFS 4.1 టెక్నాలజీలు తోడవ్వడంతో ఫోన్ పనితీరు సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే ఏకంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 (Origin OS 6) వెర్షన్‌పై ఈ మొబైల్ పనిచేస్తుంది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావడం వల్ల యూజర్లకు భవిష్యత్తులో వచ్చే అన్ని కొత్త అప్‌డేట్స్ త్వరగా అందుతాయి.

కెమెరా లవర్స్ మెచ్చే జైస్ (Zeiss) సెటప్..

కెమెరా క్వాలిటీ విషయంలో వివో బ్రాండ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఫోటోగ్రఫీ లవర్స్ ఆశించే హై క్వాలిటీ చిత్రాల కోసం ఇందులో జైస్ ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను వెనుక భాగంలో అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో రాత్రి పూట కూడా ఫోటోలు చాలా క్లియర్‌గా, డీటైల్డ్‌గా వస్తాయి.

దీన్ని ఆనుకుని సుదూర దృశ్యాలను బంధించేందుకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, విశాలమైన ప్రకృతి అందాలను కవర్ చేసేందుకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్ ఫీచర్‌తో ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వడం నిజంగా అద్భుతం. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో హై క్వాలిటీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఈ ఫ్రంట్ కెమెరా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

కొండంత బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..

ప్రస్తుతం చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ టెన్షన్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు వివో X300e మోడల్‌లో 7200mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని ప్రవేశపెట్టారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా నిర్విరామంగా ఫోన్‌ను వాడుకోవచ్చు.

బ్యాటరీ సైజు ఇంత పెద్దదిగా ఉన్నా త్వరగా ఛార్జ్ అయ్యేలా 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను సంస్థ జోడించింది. వర్షంలో తడిచినా, దుమ్ము ధూళి తగిలినా ఫోన్ పాడవకుండా అత్యుత్తమ IP68, IP69 రేటింగ్‌తో గట్టి రక్షణ కల్పించారు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే లేటెస్ట్ 5G సపోర్ట్, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ (NFC), యూఎస్‌బీ (USB) టైప్-సి పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్ లాంటి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ అన్నీ పొందుపరిచారు.

మొత్తంగా పరిశీలిస్తే జైస్ ట్యూనింగ్ కెమెరాలు, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ లాంటి స్పెసిఫికేషన్లతో వివో X300e మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు రెడీగా ఉంది. చైనాలో అడుగుపెట్టిన ఈ అద్భుతమైన మొబైల్ త్వరలోనే భారత్ మార్కెట్లోకి వస్తుందని టెక్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story