Ultraviolette X47: 323 కిమీ రేంజ్.. 8 లక్షల కిమీ వారంటీ.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న కొత్త ఈ-బైక్

Ultraviolette X47: ఎలక్ట్రిక్ వెహికల్ లవర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది.

CR Reddy
Published on: 11 Sept 2026 10:07 AM IST
Ultraviolette X47
X

Ultraviolette X47 

Ultraviolette X47: ఎలక్ట్రిక్ వెహికల్ లవర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. భారత మార్కెట్‌లో పెట్రోల్ ధరల భయంతో ఈవీల వైపు చూస్తున్న కస్టమర్ల కోసం అల్ట్రావయోలెట్ సంస్థ X47 క్రాసోవర్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా 8 లక్షల కిలోమీటర్ల వారంటీ, ముందు వెనుక హెచ్‌డీ కెమెరాలతో ఈ బైక్ ఇప్పుడు వాహన రంగంలో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా నడుస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటంతో దాదాపు అందరూ ఈవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ అల్ట్రావయోలెట్ ఎక్స్47 మోడల్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. స్టైలిష్ డిజైన్, ఐసీఈ మోడళ్లకు ఏమాత్రం తీసిపోని పవర్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో ఈ వాహనాన్ని రూపొందించారు.

ఎవరూ ఊహించని 8 లక్షల కిలోమీటర్ల వారంటీ

ఈ మోటార్‌సైకిల్ ప్రత్యేకత దాని బ్యాటరీ వేరియంట్లు, వాటిపై ఇస్తున్న వారంటీ వ్యవధి. బేస్ వేరియంట్ అయిన 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌పై 3 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తోంది. దీనిని 5 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు విస్తరించుకోవచ్చు. రీకాన్ వేరియంట్‌లోని 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీపై 5 ఏళ్ల వారంటీ వస్తుంది. టాప్ ఎండ్ డెజర్ట్ వింగ్ వేరియంట్‌లోని 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌పై ఏకంగా 8 ఏళ్లు లేదా 8,00,000 కిలోమీటర్ల అసాధారణమైన 'యూవీ కేర్ మ్యాక్స్' వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఏ ఎలక్ట్రిక్ వాహనంలోనూ ఇలాంటి భరోసా ఇప్పటివరకు చూడలేదు.

అద్భుతమైన రేంజ్.. రాకెట్ వేగం

పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ మోటార్ సైకిల్ నయా చరిత్ర సృష్టిస్తోంది. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 323 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుండటం గమనార్హం. కేవలం 2.7 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 145 కిలోమీటర్లుగా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఇంజిన్ 30 కేడబ్ల్యూ పీక్ పవర్, 610 ఎన్ఎం గరిష్ట టాప్ ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇంతటి పవర్ఫుల్ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2,49,000గా నిర్ణయించారు.

ముందు, వెనుక ఫుల్ హెచ్‌డీ కెమెరాలు

రైడింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు బైక్ ముందు, వెనుక భాగాల్లో రెండు ఫుల్ హెచ్‌డీ కెమెరాలను అమర్చారు. ఇవి 120 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని రికార్డు చేస్తాయి. రికార్డింగ్స్ నిల్వ చేసుకునేందుకు ఏకంగా 256 జీబీ ఇన్-బిల్ట్ స్టోరేజ్ కల్పించారు. ఇంకా గ్లైడ్, కాంబ్యాట్, బాలిస్టిక్ అనే మూడు రకాల రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఈ వాహనంలో లభిస్తాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story