Tata Sierra EV : టాటా సియెర్రా రీ-ఎంట్రీ.. EVలో కొత్త సంచలనం.!

Tata Sierra EV : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఐకానిక్ బ్రాండ్ 'సియెర్రా'ను టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో

G Krishna
Published on: 29 Jun 2026 3:34 PM IST
Tata Sierra EV
X

Tata Sierra EV

Tata Sierra EV : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఐకానిక్ బ్రాండ్ 'సియెర్రా'ను టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగితీసుకొస్తోంది. జూన్ 30న ఈ SUV అధికారికంగా లాంచ్ కానుండగా, తాజాగా విడుదలైన సరికొత్త టీజర్ కార్ లవర్స్‌లో అంచనాలను పతాక స్థాయికి చేర్చింది. టాటా ఈవీ (EV) లైనప్‌లో ఇది 7వ మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

త్వరలో రాబోయే సాధారణ (ఇంధన) సియెర్రాతో పోలిస్తే, ఈవీ వెర్షన్‌లో ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఫ్రంట్ ప్రొఫైల్ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్‌తో క్లీన్‌గా, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో కనిపిస్తుంది. అదే సమయంలో, ఒరిజినల్ సియెర్రా కార్లకు ఉన్న సిగ్నేచర్ బాక్సీ స్టాన్స్, వెనుక వైపు ఉండే పెద్ద గ్లాస్‌హౌస్ విండోస్ , రోడ్ ప్రెజెన్స్‌ను అలాగే నిలబెట్టుకోవడం విశేషం. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే మోడ్రన్ లుక్‌తో ఈ కారు అలరించనుంది.

'QWD' డ్యూయల్ మోటార్ టెక్నాలజీ

లేటెస్ట్ టీజర్‌లో ఈ SUV ఎడారి ఇసుక తిన్నెల్లో అలవోకగా దూసుకెళ్లడం కనిపించింది. దీని టెయిల్‌గేట్‌పై 'QWD Dual Motor' బ్యాడ్జ్ ఉంది. దీని బట్టి హారియర్ ఈవీ తరహాలోనే సియెర్రా ఈవీలో కూడా ఆల్-వీల్-డ్రైవ్ (AWD) టెక్నాలజీని టాటా అందిస్తోందని స్పష్టమైంది. ముందు, వెనుక యాక్సిల్స్‌పై విడివిడిగా ఉండే స్వతంత్ర ఎలక్ట్రిక్ మోటార్లు దీనికి మెరుగైన ఆఫ్‌రోడింగ్ గ్రిప్‌ను, అద్భుతమైన పవర్‌ను ఇస్తాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ.. అధునాతన ప్లాట్‌ఫారమ్

టాటా మోటార్స్ తమ లేటెస్ట్ 'acti.ev+' ఆర్కిటెక్చర్‌పై ఈ కారును రూపొందించింది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్ వేరియంట్లలో 65kWh బ్యాటరీ ప్యాక్ రానుండగా, డ్యూయల్ మోటార్ QWD టాప్ వేరియంట్లలో మరింత పవర్‌ఫుల్ 75kWh బ్యాటరీ ప్యాక్ లభించే ఛాన్స్ ఉంది. ఖచ్చితమైన రేంజ్ వివరాలు రేపటి లాంచ్‌లో తెలియనున్నప్పటికీ, ప్రస్తుత ఈవీల కంటే ఇది చాలా ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం.

లగ్జరీ క్యాబిన్.. ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్

సియెర్రా ఈవీ ఇంటీరియర్ సరికొత్త లగ్జరీ ఫీచర్లతో నిండి ఉండబోతోంది. టాప్ వేరియంట్లలో ఏకంగా ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్‌ను ఇస్తున్నారు. అంటే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో పాటు కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్ లభిస్తుంది. ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డాల్బీ అట్మాస్‌తో కూడిన JBL సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ ADAS సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధర , మార్కెట్ పోటీ

టాటా లైనప్‌లో ఈ కారు కర్వ్ ఈవీ (Curvv EV) కి, హారియర్ ఈవీ (Harrier EV) కి మధ్యలో రానుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 18 లక్షల నుండి రూ. 24 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వచ్చాక మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఇ-విటారా , టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీలతో గట్టి పోటీ ఎదుర్కోనుంది. పూర్తి వివరాల కోసం రేపటి అధికారిక లాంచ్ వరకు చూడాల్సిందే.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story