EV Cars: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్
EV Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తమ EV మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
EV Cars: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్
EV Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తమ EV మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే నెలకు సంబంధించి కొన్ని కార్లపై ఏకంగా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి.
టాటా EV డిస్కౌంట్ ఆఫర్ ముఖ్యాంశాలు
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల రేంజ్‌పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, గ్రీన్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మోడల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ (MY24, MY25, MY26) ఆధారంగా డిస్కౌంట్ మారుతుంది. EV కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
నెక్సాన్ ఈవీపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్
టాటా నెక్సాన్ EVపై గరిష్టంగా రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. MY24, MY25 మోడల్స్‌పై గ్రీన్ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి అన్ని కలిపి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. MY26 మోడల్‌పై మాత్రం గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే తగ్గింపు ఉంది. ఇది మిడ్-రేంజ్ EV కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్.
హారియర్ EVపై రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనం
టాటా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV అయిన హారియల్ ఈవీపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. MY25, MY26 మోడల్స్‌పై గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా EVకి అప్‌గ్రేడ్ అయ్యే కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి.
టియోగో ఈవీ, పంచ్ ఈవీపై భారీ సేవింగ్స్
టాటా కంపెనీకి చెందిన తక్కువ ధర EV మోడల్స్ అయిన టియాగో EV, పంచ్ EVపై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. టియాగో EVపై వేరియంట్ ఆధారంగా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే పంచ్ ఈవీపై కూడా గరిష్టంగా రూ. 2.1 లక్షల వరకు సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి. MY26 మోడల్స్‌పై కూడా గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ EV కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
కర్వ్ ఈవీపై ఏకంగా రూ. 3 లక్షల వరకు
ఈ మొత్తం ఆఫర్లలో అత్యధిక ప్రయోజనం కర్వ్ ఈవీపై లభిస్తోంది. MY24, MY25 మోడల్స్‌పై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. MY26 మోడల్స్‌పై కూడా రూ. 2.8 లక్షల నుంచి రూ. 3.3 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. పెద్ద SUV స్టైల్ EV కొనాలనుకునే వారికి ఈ డీల్ ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయమైనదిగా మారింది.




