EV Discounts June 2026: టాటా ఈవీలపై బంపర్ ఆఫర్.. హారియర్ EVపై రూ. 2.75 లక్షల వరకు తగ్గింపు..!
Tata EV Discounts June 2026: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) శ్రేణిని మరింత చేరువ చేసేందుకు జూన్ 2026 నెలకు గానూ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది.
EV Discounts
Tata EV Discounts June 2026: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) శ్రేణిని మరింత చేరువ చేసేందుకు జూన్ 2026 నెలకు గానూ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడల్స్‌పై ఏకంగా రూ. 3.35 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తూ వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాత స్టాక్‌తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్లపై కూడా గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఆఫర్లు , లాయల్టీ బోనస్ వంటి రూపాల్లో ఈ రాయితీలు లభిస్తున్నాయి.
టాటా కర్వ్ ఈవీపై కాసుల వర్షం
టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఈ నెల అత్యధిక లాభం చేకూరుస్తున్న మోడల్ 'కర్వ్ ఈవీ'. ముఖ్యంగా ఇందులోని నాన్-X వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.35 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ. 3 లక్షల భారీ గ్రీన్ బోనస్‌తో పాటు, పాత కారును మార్చుకునే వారికి రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ. 35,000 స్క్రాపేజ్ ప్రయోజనం అందుబాటులో ఉంది. అలాగే క్రియేటివ్ వేరియంట్లపై రూ. 2.85 లక్షల వరకు, , ఎక్స్ వేరియంట్లపై లాయల్టీ బోనస్‌తో కలిపి మొత్తం రూ. 65,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
హారియర్ ఈవీపై లక్షల్లో ప్రయోజనాలు
ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టాటా హారియర్ ఈవీలోని అన్ని వేరియంట్లపై కంపెనీ రూ. 2.75 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 75,000 స్క్రాపేజ్ బెనిఫిట్‌ను ఎంచుకోవచ్చు. దీనికి తోడు రూ. 1 లక్ష లాయల్టీ బోనస్ , మరో రూ. 1 లక్ష అదనపు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ అందిస్తోంది, ఇది హారియర్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
మధ్యతరగతి ఈవీలు: పంచ్ , టియాగోపై ఆఫర్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ ఈవీ , టియాగో ఈవీలపై కూడా టాటా ఆకర్షణీయమైన రాయితీలను ఇస్తోంది. పంచ్ ఈవీ పాత వేరియంట్లపై రూ. 95,000 నుండి రూ. 1.45 లక్షల వరకు ఆఫర్లు ఉండగా, లాంగ్ రేంజ్ (LR) మోడల్స్ పై గరిష్ట లబ్ధి చేకూరుతోంది. ఇక టియాగో ఈవీ విషయానికి వస్తే, దీనిపై రూ. 65,000 నుండి రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా టియాగో ఎల్ఆర్ ఎక్స్ టీ (LR XT) వేరియంట్ పై రూ. 50,000 అదనపు బెనిఫిట్ తో కలిపి అత్యధికంగా రూ. 1.45 లక్షల ఆఫర్ అందుబాటులో ఉంది.
నెక్సాన్ ఈవీ డిస్కౌంట్ , ముఖ్య గమనిక
టాటా నెక్సాన్ ఈవీ శ్రేణిపై మొత్తంగా రూ. 50,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 15,000 గ్రీన్ బోనస్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ , రూ. 35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్ఛేంజ్ , స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఈ ఆఫర్లు డీలర్ల వద్ద ఉన్న స్టాక్ లభ్యత, కస్టమర్ ఉండే ప్రాంతం , ఇతర అర్హతలను బట్టి మారవచ్చు. కాబట్టి ఖచ్చితమైన ఆన్-రోడ్ ధర , డిస్కౌంట్ వివరాల కోసం మీ సమీపంలోని టాటా మోటార్స్ అధికారిక డీలర్‌ను సంప్రదించడం ఉత్తమం.




