Top 5 Upcoming SUVs Releasing in April : రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్లోకి 5 అదిరిపోయే కార్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Top 5 Upcoming SUVs Releasing in April : భారత మార్కెట్లోకి రాబోతున్న టాప్ 5 కొత్త ఎస్‌యూవీలు. టయోటా ఎబెల్లా నుంచి టాటా సియెర్రా ఈవీ వరకు పూర్తి వివరాలు, ఫీచర్లు, రేంజ్ గురించి తెలుసుకుందాం.

CR Reddy
Updated on: 31 March 2026 11:44 AM IST
Tata Sierra EV
X

Tata Sierra EV 

Top 5 Upcoming SUVs Releasing in April : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీ (SUV)ల హవానే నడుస్తోంది. కార్ల కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అదిరిపోయే మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో ఇండియన్ రోడ్లపైకి రాబోతున్న 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.

1. టయోటా ఇబెల్లా

టయోటా నుంచి రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందింది. ఇందులో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 440 కి.మీ నుంచి 543 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని సమాచారం. లోపల పెద్ద టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకోనుంది.

2. ఎంజీ మెజెస్టర్

లగ్జరీ కార్ల ప్రేమికుల కోసం ఎంజీ మోటార్స్ మజెస్టర్‎ను సిద్ధం చేస్తోంది. ఇది చాలా పెద్దదిగా, చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఇందులో మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. 2.0 లీటర్ పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

3. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్

స్టైలిష్ ఎస్‌యూవీగా పేరున్న టైగన్ ఇప్పుడు సరికొత్త లుక్‌తో రాబోతోంది. దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడంతో పాటు, పనోరమిక్ సన్‌రూఫ్, అప్‌డేటెడ్ ఇంజిన్ ఆప్షన్లను జోడించారు. జర్మన్ ఇంజనీరింగ్‌ను ఇష్టపడే వారికి ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది.

4. నిస్సాన్ టెక్టాన్

నిస్సాన్ కంపెనీ డస్టర్ మోడల్‌కు సరికొత్త రూపం ఇచ్చి టెక్టాన్ పేరుతో లాంచ్ చేయబోతోంది. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో రకరకాల ఇంజిన్ ఆప్షన్లు మరియు రఫ్ అండ్ టఫ్ డిజైన్ ఉండబోతున్నాయి. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.

5. టాటా సియెర్రా ఈవీ

ఒకప్పటి ఐకానిక్ కారు సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ వస్తోంది. ఇది 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉండొచ్చు. పాత జ్ఞాపకాలను ఆధునిక టెక్నాలజీతో కలిపి టాటా ఈ కారును రూపొందించింది.

CR Reddy

CR Reddy

Next Story