Skoda Slavia : స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త లుక్.. నయా గేర్‎బాక్స్‌తో ఆగస్టు 18న ఎంట్రీ

Skoda Slavia : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తన పాపులర్ సెడాన్ స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆగస్టు 18న భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది.

CR Reddy
Published on: 28 July 2026 9:21 AM IST
Skoda Slavia
X

Skoda Slavia

Skoda Slavia : భారతీయ కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ డేట్ ఖరారైంది. ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తన పవర్‌ఫుల్ మిడ్-సైజ్ సెడాన్ స్లావియా కొత్త వర్షన్‌ను ఆగస్టు 18న అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కొత్త డిజైన్, ఆకర్షణీయమైన లుక్, అధునాతన ఫీచర్లు, కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఈ కారు రాబోతోంది. కొత్త సెడాన్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశమని చెప్పవచ్చు.

అట్రాక్టివ్ ఎక్స్‌టీరియర్.. సరికొత్త డిజైన్

ఇటీవల లీకైన స్పై చిత్రాల ఆధారంగా కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ లుక్‌లో పలు కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కారు ముందు భాగంలో అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ లభించనున్నాయి. కుషాక్, కోడియాక్ కార్ల మాదిరిగానే గ్రిల్‌లో ఇన్-బిల్ట్ లైటింగ్ ఎలిమెంట్స్ ఇచ్చే అవకాశముంది. వీటితో పాటు సరికొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, కొత్త అలాయ్ వీల్స్, వెనుక వైపు టెయిల్ లాంప్స్‌కు ఫ్రెష్ లుక్ అందించనున్నారు.

ప్రీమియం కేబిన్.. మసాజ్ సీట్ల హంగులు

ఇంటిరియర్ విషయానికి వస్తే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ దాదాపు పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ, కేబిన్‌కు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు కొత్త సీట్ అప్‌హోల్స్టరీని అందించబోతున్నారు. డ్రైవర్ కోసం పెద్దదైన 10.25 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఇందులో రానున్నాయి. విశేషమేమిటంటే కుషాక్ మోడల్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్ జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 6-ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ప్రామాణిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో కొనసాగనున్నాయి.

కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్

ఇంజన్ విభాగంలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ, ఒక ప్రధానమైన మెకానికల్ మార్పు చోటుచేసుకోనుంది. ఇందులో 1.0-లీటర్ టిఎస్ఐ, 150 బిహెచ్‌పి పవర్ ఇచ్చే 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. అయితే 1.0-లీటర్ ఇంజన్‌లో ఇదివరకు ఉన్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌కు బదులుగా కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 1.5-లీటర్ ఇంజన్ వేరియంట్లలో యథావిధిగా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గియర్‌బాక్స్ కొనసాగుతుంది.

ధర, పోటీ

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 18.19 లక్షల మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, గేర్‌బాక్స్ అప్‌గ్రేడ్‌ల వల్ల ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర స్వల్పంగా పెరిగే అవకాశముంది. భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ కారు ఫాక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మిడ్-సైజ్ సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story