Upcoming Cars: కార్ లవర్లకు అలర్ట్.. సెప్టెంబర్లో రోడ్లపైకి రానున్న 4 కొత్త మోడళ్ల లిస్ట్ ఇదే

Upcoming Cars: సెప్టెంబర్ నెల భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త వెలుగులు తీసుకురానుంది.

CR Reddy
Published on: 31 Aug 2026 1:54 PM IST
Porsche Cayenne
X

Porsche Cayenne

Upcoming Cars: సెప్టెంబర్ నెల భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త వెలుగులు తీసుకురానుంది. వివిధ విభాగాల్లో పోటీ పడేందుకు దిగ్గజ సంస్థలు తమ నయా మోడళ్లను రోడ్లపైకి తేనున్నాయి. కియా ఫ్లాగ్‌షిప్ మోడల్ నుంచి పోర్షే ఎలక్ట్రిక్ వరకు మార్కెట్‌ను ఊపేయడానికి సిద్ధమైన ఆ నాలుగు కార్ల వివరాలు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 4న కియా సోరెంటో గ్రాండ్ ఎంట్రీ

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తన నూతన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సోరెంటోను సెప్టెంబర్ 4న భారత మార్కెట్లో విడుదల చేస్తోంది. రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారులో 1.6-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ 238 హెచ్‌పి పవర్ ఇస్తుండగా, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 202 హెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. ఇంటీరియర్‌లో జంట 12.3-ఇంచ్ స్క్రీన్లు, అడాస్ సురక్షిత సాంకేతికత, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ అమర్చారు. 6, 7 సీటర్ వేరియంట్లలో లభించే ఈ కారు స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

సెప్టెంబర్ 5న మార్కెట్లోకి మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్

దేశీయంగా అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మారుతి బలేనో సరికొత్త అవతారంలో సెప్టెంబర్ 5న మన ముందుకు రానుంది. నూతన ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్స్ లేని కొత్త బంపర్, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్‌తో ఈ కారును ముస్తాబు చేశారు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90 హెచ్‌పి) 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లతో రానుంది. సీఎన్‌జీ వేరియంట్ (77.5 హెచ్‌పి) కూడా లభిస్తుంది. ఈ బడ్జెట్ కారు టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20లకు నేరుగా సవాల్ విసరనుంది.

సెప్టెంబర్ 11న బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఐ7 ఫేస్‌లిఫ్ట్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన 7 సిరీస్‌లో 740ఐ (పెట్రోల్), 740డి (డీజిల్)తో పాటు ఎలక్ట్రిక్ మోడల్ ఐ7 ఫేస్‌లిఫ్ట్‌ను సెప్టెంబర్ 11న ఆవిష్కరిస్తోంది. అప్‌డేటెడ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, గ్లోయింగ్ గ్రిల్ కారుకు గంభీరమైన రూపాన్ని తెచ్చిపెట్టాయి. లోపల వెనుక ప్రయాణికుల కోసం 31.3-ఇంచ్ 8కే థియేటర్ స్క్రీన్, మసాజ్ సీట్లు ఇచ్చారు. ఐ7 ఎలక్ట్రిక్ టాప్ వేరియంట్ 112.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఏకంగా 680 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

సెప్టెంబర్ 30న పోర్షే కేయేన్ ఎలక్ట్రిక్

స్పోర్ట్స్ లగ్జరీ విభాగంలో అత్యంత నిరీక్షణ కలిగిస్తున్న పోర్షే కేయేన్ ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 30న భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.77 కోట్లు కాగా, టాప్ టర్బో వేరియంట్ ధర రూ. 2.27 కోట్లుగా నిర్ణయించారు. 113 కిలోవాట్ అవర్ భారీ బ్యాటరీతో వచ్చే టాప్ మోడల్ ఏకంగా 1,156 హెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తూ, కేవలం 2.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 537 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story