Renault SUVs India : సరికొత్త ఫీచర్లతో రాబోతున్న 6 అదిరిపోయే SUVలు.!

Renault SUVs India : ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్' (Renault) సరికొత్త జనరేషన్ 'డస్టర్' (Duster) కారుతో భారత మార్కెట్లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి

G Krishna
Published on: 20 Jun 2026 3:00 PM IST
Renault
X

Renault

Renault SUVs India : ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్' (Renault) సరికొత్త జనరేషన్ 'డస్టర్' (Duster) కారుతో భారత మార్కెట్లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇండియాలో పోగొట్టుకున్న తన పాత వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకోవడానికి కంపెనీ ఏకంగా 6 సరికొత్త ఎస్‌యూవీ (SUV) మోడళ్లను లాంచ్ చేయబోతోంది. మరి రాబోయే ఈ కార్లలో ఎలాంటి క్రేజీ ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు ఉండబోతున్నాయో డీటెయిల్డ్‌గా చూద్దాం!

1. రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ (Renault Duster Hybrid)

కొత్త జనరేషన్ డస్టర్ లాంచ్ సమయంలోనే రెనాల్ట్ కంపెనీ దీని 'స్ట్రాంగ్ హైబ్రిడ్' వెర్షన్‌ను 2026 దీపావళి నాటికి తీసుకురానున్నట్లు ప్రకటించింది. లుక్ పరంగా ఇది రెగ్యులర్ డస్టర్ లాగే ఉన్నప్పటికీ, దీని అసలు పవర్ అంతా ఇంజన్ లోనే ఉంది. ఇందులో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh బ్యాటరీ , 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇస్తున్నారు. సిటీలో 80 శాతం వరకు ఈ కారును ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడపవచ్చని, ఇది లీటరుకు ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర రూ. 20-25 లక్షల మధ్య ఉండొచ్చు.

2. రెనాల్ట్ బోరెల్ (Renault Bigster/Borel)

డస్టర్ తర్వాత 2026 చివరి నాటికి రెనాల్ట్ 'బోరెల్' మార్కెట్లోకి రానుంది. ఇది డస్టర్‌కు చెందిన 3-రో, 7-సీటర్ వెర్షన్. 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో ఉండే ఈ పెద్ద కారులో 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఇస్తున్నారు. ఇది 163 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీని లోపల గూగుల్ ఇన్‌బిల్ట్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, మసాజ్ ఫంక్షన్ ఉన్న పవర్ సీట్లు , లెవెల్-2 ADAS వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 13 లక్షల నుండి రూ. 23 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

3. రెనాల్ట్ బోరెల్ హైబ్రిడ్ (Renault Borel Hybrid)

స్టాండర్డ్ బోరెల్ మోడల్ వచ్చిన తర్వాత, రెనాల్ట్ ఇందులో కూడా ఒక పవర్‌ఫుల్ హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురానుంది. కొత్త డస్టర్ హైబ్రిడ్‌లో వాడిన 1.8-లీటర్ ఈ-టెక్ (E-Tech) హైబ్రిడ్ ఇంజన్‌నే దీనిలోనూ ఉపయోగించనున్నారు. ఇది కూడా 160 bhp పవర్, 172 Nm టాక్‌ను ఇస్తుంది. ఈ కారు 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండగా, దీని ప్రారంభ ధర దాదాపు రూ. 22 లక్షలుగా ఉండొచ్చు.

4. రెనాల్ట్ బ్రిజ్జర్ (Renault Niagara/Brizzer)

రెనాల్ట్ గ్లోబల్ మార్కెట్లో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంటోంది. 2027లో లాంచ్ కాబోతున్న ఈ కారు టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజ్జాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది సరికొత్త RGMP ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ , టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పెద్ద టచ్‌స్క్రీన్ , బలమైన సేఫ్టీ ప్యాకేజీతో రాబోయే ఈ కారు ప్రారంభ ధర రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.

5. రెనాల్ట్ బ్రిజ్జర్ ఈవీ (Renault Brizzer EV)

పెట్రోల్ వెర్షన్ బ్రిజ్జర్ వచ్చిన కొద్దిరోజులకే దీని ఎలక్ట్రిక్ వెర్షన్ 'బ్రిజ్జర్ ఈవీ'ని రెనాల్ట్ లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ఓటీఏ (OTA) అప్‌డేట్స్ , పెద్ద కేబిన్ స్పేస్‌ను ఇవ్వనున్నారు. ఇది మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీతో పాటు భవిష్యత్తులో రాబోయే మహీంద్రా, మారుతి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలుస్తుంది. దీని ధర రూ. 13-18 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

6. రెనాల్ట్ బ్రిజ్జర్ హైబ్రిడ్ (Renault Brizzer Hybrid)

భవిష్యత్తులో బ్రిజ్జర్‌కు ఒక పవర్‌ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ కూడా వస్తుందని రెనాల్ట్ స్పష్టం చేసింది. ఇది 1.2-లీటర్ హైబ్రిడ్-రెడీ పెట్రోల్ ఇంజన్, ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటార్ , బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లకు మారడానికి ఇష్టపడని, ఎక్కువ మైలేజ్ కోరుకునే మిడిల్ క్లాస్ కస్టమర్ల కోసం దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే అత్యంత చౌకైన హైబ్రిడ్ ఎస్‌యూవీగా మారే అవకాశం ఉంది. దీని ధర రూ. 12-17 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. భవిష్యత్తులో ఇది 2027-28 నాటికి రోడ్లపైకి రానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story