తక్కువ ధర, అదిరిపోయే మైలేజీ.. అందరి చూపు ఈ చిన్న కారుపైనే.. డౌన్ పేమెంట్‌తోపాటు ఈఎంఐ ఎంతంటే?

Renault Kwid Price: రెనాల్ట్ క్విడ్‌ను సీఎన్‌జీలో కూడా కొనుగోలు చేసే వీలుంది. కాగా, దీని ఎక్స్ షోరూమ్ ప్రైజ్ చూస్తే రూ. 5,23,349ల నుంచి మొదలుకానుంది.

Venkat
Published on: 8 July 2026 6:46 PM IST
Renault Kwid Price
X

తక్కువ ధర, అదిరిపోయే మైలేజీ.. అందరి చూపు ఈ చిన్న కారుపైనే.. డౌన్ పేమెంట్‌తోపాటు ఈఎంఐ ఎంతంటే?

Renault Kwid Price: దేశంలో అత్యంత చౌకగా లభించే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి రెనాల్ట్ క్విడ్. దీంతో ఎక్కువమంది రెనాల్డ్ క్విడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో కంపెనీ ఈ మోడల్‌ను అప్‌డేట్ చేసి, 2 వేరియంట్లలో అందిస్తోంది. బేస్ వేరియంట్ ధర రూ. 4,52,900 (ఎక్స్-షోరూమ్)కు అందిస్తుండగా, క్లైంబర్ ఏఎంటీ వేరియంట్‌ను కేవలం రూ. 5,60,900 (ఎక్స్-షోరూమ్) కు అందిస్తోంది.

అలాగే, రెనాల్ట్ క్విడ్‌ను సీఎన్‌జీలో కూడా కొనుగోలు చేసే వీలుంది. కాగా, దీని ఎక్స్ షోరూమ్ ప్రైజ్ చూస్తే రూ. 5,23,349ల నుంచి మొదలుకానుంది. ఈ కార్‌ను మీరు కూడా కొనాలని చూస్తుంటే, అందుకు సంబంధించిన వివరాలను అంటే అసలు ధర, ఈఎంఐ, డౌన్ పేమెంట్ వివరాలను ఓసారి చూద్దాం..

రెనాల్ట్ క్విడ్ ఆన్ రోడ్ ధర..

రెనాల్ట్ క్విడ్‌ రూ. 4,52,900లకు ఇంటికి తెచ్చుకోవాలంటే అదనంగా రూ. 36,232 ఆర్టీఓ ఫీజుతోపాటు రూ.23,323 ఇన్సూరెన్స్ కూడా చెల్లించాలి. ఇవన్నీ కలిపితే ఆన్ రోడ్ ధర రూ 5,12,455గా మారుతుంది.

రెనాల్ట్ క్విడ్ డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు మీకోసం..

కొత్త రెనాల్ట్ క్విడ్ కొనేందుకు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించారనుకుందాం. మిగిలిన రూ. 4,12,455లకు లోన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 700+ ఉంటే 10 శాతం వడ్డీతో ఈఎంఐ పొందే ఛాన్స్ ఉంటుంది.

అలాగే, ఈ కార్ లోన్‌ను 5 సంవత్సరాలకు తీసుకుంటే, 10శాతం వడ్డీతో కలిపి నెలకు రూ. 8,763 చొప్పున మొత్తం 60 ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మొత్తంగా మీరు రూ.5,25,807లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, దీనికి మొదట చెల్లించిన రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ కూడా యాడ్ చేస్తే అప్పుడు మొత్తం మనం కార్ కోసం చేసే ఖర్చు రూ. 6,25,807లు అవుతుంది.

రెనాల్ట్ క్విడ్ 2026 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన బంపర్‌లతోపాటు టెయిల్‌లైట్లు ఉన్నాయి. లోపల 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోలు, విశాలమైన క్యాబిన్ ఉన్నాయి. బూట్ స్పేస్ 279 లీటర్లుగా ఉంది.

ఫీచర్లతోపాటు సేఫ్టీ..

ఇక ఫీచర్ల విషయానికి వస్తే కీలెస్‌ ఎంట్రీ, రియర్ కెమెరా, మాన్యువల్ ఏసీ ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం, టాప్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్పీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ లభిస్తాయి. ఇది గతంలో గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP) నుంచి 2 స్టార్ రేటింగ్‌ను అందుకుంది.

ఇంజిన్‌తోపాటు మైలేజ్..

ఇది 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది 69 పీఎస్ పవర్, 92 ఎన్ఎం టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్‌తోపాటు ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వచ్చింది. అలాగే, సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. మైలేజ్ విషయానికి వస్తే 21.7 నుంచి 22.5 కిలో మీటర్లుగా ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story