Portronics Vayu Nano : టైర్‌లో గాలి తగ్గిందా.? జేబులో ఈ మినీ డివైజ్ ఉంటే 5 నిమిషాల్లో సాల్వ్!

Portronics Vayu Nano : ప్రముఖ డిజిటల్ యాక్సెసరీస్ బ్రాండ్ ‘పోర్ట్రానిక్స్’ (Portronics) ప్రయాణికులు , వాహనదారుల కోసం ఒక సరికొత్త గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి..

G Krishna
Published on: 30 May 2026 5:01 PM IST
portronics vayu nano
X

portronics vayu nano

Portronics Vayu Nano : ప్రముఖ డిజిటల్ యాక్సెసరీస్ బ్రాండ్ ‘పోర్ట్రానిక్స్’ (Portronics) ప్రయాణికులు , వాహనదారుల కోసం ఒక సరికొత్త గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అత్యంత చిన్న సైజులో, జేబులో , బ్యాగ్‌లో సులభంగా ఇమిడిపోయేలా ‘పోర్ట్రానిక్స్ వాయు నానో’ (Portronics Vayu Nano) పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. బైకులు, స్కూటర్లు, సైకిళ్ల టైర్లలో గాలి తగ్గినా.. ప్రయాణాల్లో అకస్మాత్తుగా పంచర్ అయినా ఎవరి సహాయం లేకుండా నిమిషాల్లో ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా సులభంగా గాలి నింపుకోవచ్చు.

ధర, లభ్యత వివరాలు

ఈ పోర్ట్రానిక్స్ వాయు నానో టైర్ ఇన్‌ఫ్లేటర్ ప్రస్తుతం మార్కెట్లో ఒకే ఒక మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని సాధారణ రిటైల్ ధర (MRP) రూ.4,999 గా నిర్ణయించినప్పటికీ, కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీనిని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. కాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ (Amazon) లో ఇది మరింత తక్కువగా కేవలం రూ.2,799 ధరకే లభిస్తోంది.

స్మార్ట్ ఫీచర్లు.. గాలి నింపే ప్రీసెట్ మోడ్స్

వైర్‌లెస్ (కార్డ్‌లెస్) పద్ధతిలో పనిచేసే ఈ చిన్న డివైజ్ గరిష్టంగా 120 PSI ప్రెజర్‌తో గాలిని వేగంగా నింపగలదు. వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో ముందుగానే కొన్ని ప్రీసెట్ మోడ్‌లను కంపెనీ సెట్ చేసింది. దీని ప్రకారం మోటార్ సైకిల్ టైర్ల కోసం 45 PSI, సైకిల్ టైర్ల కోసం 35 PSI, , బాస్కెట్‌బాల్ , ఫుట్‌బాల్ వంటి స్పోర్ట్స్ సామాగ్రి కోసం 8 PSI ప్రెజర్ లిమిట్‌ను లాక్ చేశారు. వాహనదారులు తమ అవసరాన్ని బట్టి కస్టమ్ మోడ్‌ను ఎంచుకోవడం ద్వారా గరిష్టంగా 120 PSI వరకు ప్రెజర్‌ను మార్చుకోవచ్చు. సాధారణ బైక్ టైర్లలో కేవలం ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 0 నుండి 35 PSI వరకు గాలిని ఇది నింపగలదని కంపెనీ స్పష్టం చేసింది.

డిజిటల్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ

ఈ పోర్ట్రానిక్స్ వాయు నానో పరికరంలో రెండు 600mAh రీఛార్జబుల్ బ్యాటరీలను అమర్చారు. డివైజ్ పైభాగంలో ఉండే యూఎస్‌బీ టైప్-సి (USB Type-C) పోర్ట్ ద్వారా దీనిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న "స్మార్ట్" డిజిటల్ డిస్‌ప్లే ద్వారా కరెంట్ ప్రెజర్ విలువ, బ్యాటరీ స్థాయి , ప్రెజర్ యూనిట్లను (PSI / BAR) ప్రయాణికులు రియల్-టైమ్‌లో స్క్రీన్‌పై చూసుకోవచ్చు. అలాగే ప్రెజర్ పెంచడానికి, తగ్గించడానికి , మోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా దీనిపై మూడు బటన్లను అందించారు.

ఆటోమేటిక్ షట్-ఆఫ్.. నైట్ టైమ్ ఎమర్జెన్సీ లైట్

వినియోగదారుల భద్రత కోసం ఈ పరికరంలో ప్రత్యేకంగా 'ఆటోమేటిక్ షట్-ఆఫ్' (Intelligent Auto Cut-off) ఫీచర్‌ను చేర్చారు. దీనివల్ల మనం సెట్ చేసిన ప్రెజర్ రాగానే డివైజ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది, తద్వారా టైర్లలో ఎక్కువ గాలి నిండి పేలిపోయే ప్రమాదం ఉండదు. చీకటి సమయాల్లో , రాత్రి వేళల్లో రోడ్డుపై అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకోవడానికి వీలుగా ఇందులో ఒక ఎల్‌ఈడీ (LED) ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు. ఇది ఎస్ఓఎస్ (SOS) ఎమర్జెన్సీ మోడ్‌తో పనిచేస్తుంది. వేర్వేరు వాహనాలకు గాలి నింపేందుకు వీలుగా బాక్స్‌తో పాటే మల్టిపుల్ నాజిల్ అడాప్టర్లను (Nozzle Attachments) కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది. టూ-వీలర్లపై లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రావెల్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story