గంటకు 237 కిమీల వేగం.. సరికొత్త మినీ కూపర్.. ధర చూస్తే కళ్లు తిరగడం ఖాయం!
Mini Cooper S Convertible JCW: భారత మార్కెట్లో ఈ సరికొత్త మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW ప్యాక్ ధరను కంపెనీ రూ. 61.50 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
గంటకు 237 కిమీల వేగం.. సరికొత్త మినీ కూపర్.. ధర చూస్తే కళ్లు తిరగడం ఖాయం!
Mini Cooper S Convertible JCW: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ, భారతీయ వాహన ప్రియుల కోసం తన సరికొత్త 'కూపర్ S కన్వర్టిబుల్ JCW ప్యాక్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యున్నత సాంకేతికత, ఆకర్షణీయమైన స్పోర్టీ లుక్ కలయికతో రూపొందిన ఈ కారు, వేగాన్ని ఇష్టపడే వారికి సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దీని ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర..
భారత మార్కెట్లో ఈ సరికొత్త మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW ప్యాక్ ధరను కంపెనీ రూ. 61.50 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ కారును పూర్తి స్థాయిలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూనిట్‌గా విక్రయిస్తున్నారు. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల, దీనికి అప్పుడే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభం కావడమే కాకుండా, డెలివరీలు కూడా మొదలయ్యాయి.
ఆకట్టుకునే ఎక్స్టీరియర్..
JCW ప్యాక్ రాకతో ఈ కన్వర్టిబుల్ కారు మరింత దూకుడుగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా 'మిడ్ నైట్ బ్లాక్', 'లెజెండ్ గ్రే' అనే రెండు ప్రత్యేక రంగులలో లభిస్తుంది. కారు ముందు భాగంలో గ్రిల్, డోర్ హ్యాండిల్స్, బంపర్లకు నిగనిగలాడే బ్లాక్ కలర్ ముగింపు ఇచ్చారు. కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, జెట్ బ్లాక్ ఫ్యాబ్రిక్ రూఫ్ దీనికి విలాసవంతమైన రూపాన్ని జోడించాయి.
అత్యాధునిక ఇంటీరియర్, ఫీచర్లు..
కారు లోపలి భాగం పూర్తిగా నలుపు రంగులో ఉండి, స్పోర్టీ సీట్లు, ప్రత్యేక స్టీరింగ్ వీల్‌తో అలరిస్తుంది. డాష్‌బోర్డ్‌పై ఎరుపు రంగు చారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాంకేతిక పరంగా, ఇందులో 9.4-అంగుళాల గుండ్రని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, శక్తివంతమైన ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ సామర్థ్యం, పనితీరు..
ఈ కారులో 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 204hp శక్తిని, 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికొస్తే, ఇది కేవలం 6.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 237 కిమీగా ఉంది. మైలేజ్ పరంగా కూడా ఇది మెరుగ్గా ఉండి, లీటరుకు 16.82 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
సేఫ్టీ ఫీచర్లు..
ప్రయాణికుల భద్రతకు మినీ కూపర్ పెద్దపీట వేసింది. ఇందులో అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, వాహన స్థిరత్వ నియంత్రణ వంటి భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.




