టాటా, మహీంద్రాలకు షాక్.. లాంచ్‌కు ముందే లీకైన ఎంజీ 7-సీటర్ ఈవీ.. లుక్ అదుర్స్..!

MG 7 Seater Electric SUV: చాలా రోజులుగా ఆన్‌లైన్‌లో 'హెక్టార్ హాక్' లేదా 'టోమాహాక్' (Hector Hawk/Tomahawk) పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ కారు గురించి నెట్టింట ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.

Venkat
Published on: 17 Aug 2026 10:09 AM IST
MG 7 Seater Electric SUV
X

టాటా, మహీంద్రాలకు షాక్.. లాంచ్‌కు ముందే లీకైన ఎంజీ 7-సీటర్ ఈవీ.. లుక్ అదుర్స్..!

MG 7 seater electric SUV: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ (MG Motors) భారత మార్కెట్లోకి తీసుకొస్తున్న సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందే లీకైంది. ఆగస్టు 26న అధికారికంగా ఆవిష్కరించాల్సిన ఈ భారీ వాహనం.. తాజాగా ఓ టీవీ యాడ్ షూటింగ్‌లో ఎలాంటి ముసుగు లేకుండా కెమెరాకు చిక్కింది. దీని ఫీచర్లు, లుక్స్ చూసి వాహన ప్రియులు ఫిదా అవుతున్నారు.

ఆ అంచనాలకు బ్రేక్.. పక్కా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..!

చాలా రోజులుగా ఆన్‌లైన్‌లో 'హెక్టార్ హాక్' లేదా 'టోమాహాక్' (Hector Hawk/Tomahawk) పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ కారు గురించి నెట్టింట ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇది కేవలం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్ మాత్రమే అని నెటిజన్లు భావించారు.

కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఇదో పూర్తిస్థాయి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) అని తాజా ఫోటోల ద్వారా స్పష్టంగా నిర్ధారణ అయింది.

గ్లోబల్ మార్కెట్లో విశేష ఆదరణ పొందిన వూలింగ్ స్టార్‌లైట్ 560 (Wuling Starlight 560) ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఎంజీ సంస్థ ఈ దేశీ మోడల్‌ను తీర్చిదిద్దింది. మధ్యతరగతి ఫ్యామిలీలకు పర్ఫెక్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఆప్షన్‌గా ఇది త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

ఆలీవ్ గ్రీన్ అందాలు.. ప్రీమియం ఫీచర్ల జాతర..!

తాజాగా ముసుగు లేకుండా బయటపడిన కమర్షియల్ షూట్ ఫోటోలను పరిశీలిస్తే.. ఈ కారు ఆలీవ్ గ్రీన్ బాడీ, గ్లాస్ బ్లాక్ రూఫ్ డ్యూయల్-టోన్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

దీని కొలతల విషయానికొస్తే ఏకంగా 4.7 మీటర్ల పొడవు, 2,810 మిమీ వీల్‌బేస్ కలిగి ఉండి, లోపల ప్రయాణికులకు ఎంతో విశాలమైన స్థలాన్ని ఇస్తుంది.

కారు ముందు భాగంలో ఉన్న డ్యూయల్ హారిజాంటల్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో పాటు సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి. రూఫ్ రైల్స్, భారీ పానోరమిక్ సన్‌రూఫ్, స్విర్ల్ ప్యాటర్న్ డిజైన్ ఉన్న డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తున్నాయి.

ఇక క్యాబిన్ లోపల టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఓ భారీ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉండనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా తెలుస్తోంది.

మైలేజ్ టెన్షన్ లేదు.. పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్!

సాధారణంగా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి ముందుగా గుర్తొచ్చేది రేంజ్ భయం. ఆ టెన్షన్ లేకుండా ఈ భారీ వాహనంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీని పొందుపరిచారు.

అంతర్జాతీయ మార్కెట్ స్పెక్స్ ఆధారంగా చూస్తే.. ఇందులో 56.7kWh, 69.2kWh అనే రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇవి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో అనుసంధానమై ఉంటాయి.

ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల మేర నాన్‌స్టాప్‌గా ప్రయాణించవచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మన దేశంలో ఈ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెస్తారా లేదా సింగిల్ బ్యాటరీ వేరియంట్‌కే పరిమితం చేస్తారా అనేది ఎంజీ అధికారిక లాంచ్ ఈవెంట్‌లో తేలనుంది.

దిగ్గజాలకు చెమటలు.. ధర ఎంత ఉండొచ్చంటే?

భారత మార్కెట్లో ఎంజీ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే విండ్సర్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి పైన, అత్యంత ఖరీదైన ఎం9 (M9) మోడల్‌కు దిగువన ఈ కొత్త 7-సీటర్‌ను పొజిషన్ చేయనున్నారు.

దీని ధర సుమారు రూ. 20 లక్షల నుంచి రూ. 27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. సరసమైన ధరలో రానున్న ఈ కారు.. త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న టాటా సఫారీ ఈవీ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ (Mahindra XEV 9S), బీవైడీ ఈమ్యాక్స్ 7 (BYD eMAX 7) వంటి బడా మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆగస్టు 26న జరగనున్న అధికారిక లాంచ్ తర్వాత ఈ కారు బుకింగ్స్, ఇతర టెక్నికల్ స్పెసిఫికేషన్లపై పూర్తి క్లారిటీ రానుంది. అత్యాధునిక ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, అద్భుతమైన రేంజ్‌తో వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీ.. ఫ్యామిలీ ఈవీ సెగ్‌మెంట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story