Mercedes AMG E 53 Hybrid: పెట్రోల్ లేకుండా 100 కిమీల రేంజ్.. అందుబాటులోకి లగ్జరీ సెడాన్.. ధర, ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

Mercedes AMG E 53 Hybrid: మెర్సిడెస్ బెంజ్ తన పవర్‌ఫుల్ ఏఎమ్‌జీ సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత్‌లోకి తీసుకొచ్చింది.

Venkat
Published on: 24 July 2026 10:19 AM IST
Mercedes AMG E 53 Hybrid
X

Mercedes AMG E 53 Hybrid: పెట్రోల్ లేకుండా 100 కిమీల రేంజ్.. అందుబాటులోకి లగ్జరీ సెడాన్.. ధర, ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

Mercedes AMG E 53 Hybrid: దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లో జర్మన్ ఆటో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సరికొత్త సంచలనం సృష్టించింది. అత్యంత పవర్ ఫుల్ మెర్సిడెస్ ఏఎమ్‌జీ ఇ 53 హైబ్రిడ్ 4మాటిక్ ప్లస్ (Mercedes-AMG E 53 Hybrid 4MATIC+) మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. రూ. 1.45 కోట్ల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్ లగ్జరీ ప్రియులను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.

మెర్సిడెస్ బెంజ్ తన పవర్‌ఫుల్ ఏఎమ్‌జీ సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత్‌లోకి తీసుకొచ్చింది. వినియోగదారుల కోసం ఈ కారును రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. అందులో పర్ఫార్మెన్స్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్) కాగా, రేసింగ్ ఎడిషన్ ధరను రూ. 1.48 కోట్లుగా నిర్ణయించారు. స్పోర్టీ లుక్, అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని ఇష్టపడే ధనవంతులకు ఈ మోడల్ ఒక డ్రీమ్ కార్ అని చెప్పవచ్చు.

రాకెట్ స్పీడ్.. కేవలం 3.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం..!

ఈ కార్ ఇంజిన్ పనితీరు ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో 3.0 లీటర్ ఇన్-లైన్ 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇవి రెండూ కలిసి ఏకంగా 585 హార్స్ పవర్ (hp), 750 న్యూటన్ మీటర్ల టాప్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. రేస్ స్టార్ట్ ఫంక్షన్‌తో ఈ పవర్ ఏకంగా 612 హార్స్ పవర్‌కు పెరుగుతుంది. ఫలితంగా ఈ కారు నిలబడిన చోటు నుంచి కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

100 కిలోమీటర్ల ఇవి రేంజ్.. నిమిషాల్లో ఛార్జింగ్..!

ఈ హైబ్రిడ్ కారులో 28.6 కిలోవాట్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, దాదాపు 100 కిలోమీటర్ల దూరంతో అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 60 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హోమ్ ఛార్జింగ్ కోసం 11 కిలోవాట్ ఏసి ఛార్జర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

అధునాతన ఫీచర్లు, లెవెల్-2 ఎడాస్ సేఫ్టీ..!

డిజైన్ పరంగా ఏఎమ్‌జీ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, విశాలమైన ఎయిర్ ఇంటేక్స్ కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. ఇంటీరియర్‌లో అత్యాధునిక డిజిటల్ డిస్ప్లేలు, బర్మెస్టర్ 4డి సరౌండ్ సౌండ్ సిస్టమ్, నాపా లెదర్ స్టీరింగ్ వీల్ ప్రయాణీకులకు రాయల్ అనుభూతిని అందిస్తాయి. భద్రత కోసం లెవెల్-2 ఎడాస్ (ADAS) సాంకేతికత, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి అత్యున్నత సేఫ్టీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

పర్ఫార్మెన్స్, లగ్జరీ, ఎకో-ఫ్రెండ్లీ హైబ్రిడ్ టెక్నాలజీ కలయికగా వచ్చిన మెర్సిడెస్ ఏఎమ్‌జీ ఇ 53, భారత సూపర్ కార్ మార్కెట్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. స్పీడ్, విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఈ కార్ ఖచ్చితంగా సరైన ఎంపికగా నిలుస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story