బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ గ్యారేజీలోకి పవర్‌ఫుల్ ఆఫ్‌రోడర్.. ఫీచర్లు చూస్తే మతిపోద్దంతే..!

Toyota: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ తాజాగా ఓ పవర్‌ఫుల్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు.

Venkat
Published on: 17 Aug 2026 10:06 AM IST
Toyota
X

బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ గ్యారేజీలోకి పవర్‌ఫుల్ ఆఫ్‌రోడర్.. ఫీచర్లు చూస్తే మతిపోద్దంతే..!

Toyota: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ తాజాగా ఓ పవర్‌ఫుల్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా అత్యంత దృఢమైన, సాహసోపేతమైన టయోటా హైలక్స్ పికప్ ట్రక్‌ను ఆమె కొనుగోలు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లో ఈ భారీ వాహనాన్ని ఆమె డెలివరీ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఛాంపియన్ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణం ఇదే..

రింగ్‌లోకి దిగితే ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మేరీకోమ్.. వాహనాల ఎంపికలోనూ తనదైన మార్క్ చూపించారు. సాధారణంగా సెలబ్రిటీలు, క్రీడాకారులు లగ్జరీ సెడాన్లు, ఖరీదైన స్పోర్ట్స్ కార్ల వైపు మొగ్గుచూపుతారు.

కానీ ఈ సిక్స్‌ టైమ్ వరల్డ్ ఛాంపియన్ మాత్రం ఆ రొటీన్ ట్రెండ్‌ను బ్రేక్ చేశారు. ఏకంగా అత్యంత కఠినమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలున్న భారీ వాహనాన్ని ఎంచుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ ట్రాఫిక్, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని గంభీరంగా దూసుకెళ్లే టయోటా హైలక్స్ ఇప్పుడు ఆమె గ్యారేజీకి కొత్త కళ తీసుకొచ్చింది. ఈ ఎంపిక చూసి ఆటోమొబైల్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

పవర్‌ఫుల్ పికప్ ట్రక్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే!

భారత మార్కెట్లో పికప్ ట్రక్కుల ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే మేరీకోమ్ ఏరికోరి మరీ జపనీస్ దిగ్గజం టయోటా నుంచి వచ్చిన బెస్ట్ మోడల్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ హైలక్స్ మోడల్‌లో అత్యంత శక్తివంతమైన 2.8 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 201 బీహెచ్‌పీ పవర్‌ను, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇసుక తిన్నెలు, బురద రోడ్లు, గుంతల రోడ్లు.. ఇలా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఇట్టే దూసుకెళ్లడం దీనికి వెన్నతో పెట్టిన విద్య. అద్భుతమైన ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ (4x4) ఉండటం వల్ల సాహస యాత్రలు చేసేవారికి ఇది ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.

ధృడత్వానికి మారుపేరు.. ఇద్దరి క్యారెక్టర్ ఒకటే!

ఆటలో ఎన్నో అవమానాలు, కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఒలింపిక్ పతకం సాధించిన మేరీకోమ్ ప్రయాణం నవతరానకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెలోని ఆ అలుపెరగని పోరాట పటిమ, దృఢత్వం ఈ కొత్త వాహనంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి.

టయోటా హైలక్స్ సైతం ప్రపంచవ్యాప్తంగా తన మన్నికకు పెట్టింది పేరు. ఏళ్ల తరబడి చెక్కుచెదరని పనితీరు ఇవ్వడంలో దీనికి ఇదే సాటి.

అందుకే తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఈ ట్రక్‌ను క్రీడాకారిణి ఎంపిక చేసుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త కారు తాళాలు అందుకుంటున్న సమయంలో ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు అభిమానులకు కిక్కిస్తోంది.

ఢిల్లీ రోడ్లపై సరికొత్త ప్రయాణం.. ధర ఎంతో తెలుసా?

ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లోని ప్రముఖ టయోటా డీలర్‌షిప్ నుంచి ఈ భారీ వాహనాన్ని మేరీకోమ్ కుటుంబ సమేతంగా ఉత్సాహంగా డెలివరీ తీసుకున్నారు.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో దీని బేస్ మోడల్ ధర సుమారు రూ.30.40 లక్షల నుంచి ప్రారంభమై.. టాప్ ఎండ్ వెర్షన్ రూ.37.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు పలుకుతోంది.

విశాలమైన డబుల్ క్యాబ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, మోడరన్ ఇంటీరియర్స్ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. వెనుక భాగంలో భారీ లగేజీ డెక్ ఉండటం వల్ల సిటీ డ్రైవింగ్‌కే పరిమితం కాకుండా సుదూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి ఆఫ్-రోడింగ్ ట్రిప్స్ వేసేందుకు ఈ వాహనం అద్భుతంగా పనికొస్తుంది.

ఒకవైపు బాక్సింగ్ దిగ్గజంగా దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మేరీకోమ్.. ఇప్పుడు తన విభిన్నమైన లైఫ్‌స్టైల్‌తోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కేవలం కంఫర్ట్ కంటే క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఇస్తూ పవర్‌ఫుల్ పికప్ ట్రక్‌ను ఎంచుకోవడం ద్వారా రియల్ లైఫ్‌లోనూ తాను ఫైటర్‌నే అని మరోసారి నిరూపించుకున్నారు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story