Maruti Suzuki: రోజుకు ఏకంగా 650 కార్లు.. 25 కిమీ మైలేజీతో మార్కెట్‌ను ఏలుతున్న మారుతి కారు

Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తూ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది.

CR Reddy
Published on: 7 Sept 2026 10:42 AM IST
Maruti Suzuki
X

Maruti Suzuki

Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తూ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. గత ఆగస్టు నెలలో రోజుకు సగటున 650కి పైగా కార్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఉత్తమ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారతీయ మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది మారుతి వ్యాగన్ ఆర్. గత నెల ఆగస్టులో ఏకంగా 20,180 ఇళ్లకు ఈ కారు చేరుకుంది. అంటే రోజుకు సగటున 650 కన్నా ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయన్నమాట. గతేడాది ఆగస్టు నెలలో నమోదైన 14,552 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇది ఏకంగా 39 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా నిలిచి తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది.

సిగ్నేచర్ డిజైన్ తో పాటు అద్భుత ఫీచర్లు

దశాబ్దాలుగా టాల్ బాయ్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ బాక్సీ షేప్ కారు ప్రతి ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుంది. కొత్త మోడల్‌లో 7 అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లాంటి ఆధునిక వసతులు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. లోపల విశాలమైన స్థలంతో పాటు 341 లీటర్ల బూట్ స్పేస్ లభించడం వస్తువులను తీసుకెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మైలేజ్ రాజా.. ఇంజిన్ సామర్థ్యం

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే 1.0 లీటర్ కే-సిరీస్, 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయంలో లీటరు పెట్రోలుకు 23.56 కిమీ నుంచి 25.19 కిమీ వరకు ఇస్తుండగా, సీఎన్జీ వేరియంట్ కిలోకు 33.47 కిమీల వరకు ప్రయాణిస్తుంది. ధర విషయానికి వస్తే ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.7.45 లక్షల వరకు ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును రూపొందించారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 1-స్టార్ రేటింగ్ వచ్చినప్పటికీ, భద్రత కోసం కంపెనీ పలు కీలక సదుపాయాలు కల్పించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్లను అందించారు. స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి భద్రతా ప్రమాణాలు రోజువారీ ప్రయాణాలకు ఎంతగానో దోహదపడతాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story