Maruti Suzuki : మారుతి భారీ స్కెచ్.. టాటా సఫారీ, ఎక్స్‌యూవీ 700లకు పోటీగా కొత్త 7-సీటర్

Maruti Suzuki : 2026 మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా కాస్మెటిక్ మార్పులు ఉండబోతున్నాయి. కారు ముందు భాగంలో కొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి.

CR Reddy
Published on: 27 April 2026 8:46 AM IST
Maruti Grand Vitara Facelift
X

Maruti Grand Vitara Facelift

Maruti Suzuki : మారుతి సుజుకి తన వినియోగదారులకు అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమైంది. దేశీయ రోడ్లపై ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తున్న తరుణంలో, తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారాను కొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. 2022లో లాంచ్ అయినప్పటి నుంచి సేల్స్ పరంగా దూసుకుపోతున్న ఈ కారుకు ఇప్పుడు మొదటిసారిగా భారీ మిడ్‌లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు పెద్ద కుటుంబాల కోసం గ్రాండ్ విటారాలో సరికొత్త 7-సీటర్ వెర్షన్‌ను కూడా మారుతి రంగంలోకి దించబోతోంది.

2026 మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా కాస్మెటిక్ మార్పులు ఉండబోతున్నాయి. కారు ముందు భాగంలో కొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇంటీరియర్లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త అప్హోల్స్టరీ, మరిన్ని ప్రీమియం ఫీచర్లను జోడించబోతున్నారు. ఇంజిన్ పరంగా చూస్తే, ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లనే కొనసాగించనున్నారు. ఇది లీటరుకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది.

మారుతి సుజుకి ఇప్పుడు 7-సీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి బలంగా అడుగుపెట్టాలని చూస్తోంది. గ్రాండ్ విటారా ఆధారంగా తయారవుతున్న ఈ కొత్త 7-సీటర్ కారును Y17 అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. ఇది గ్రాండ్ విటారా కంటే పొడవుగా ఉండి, మూడవ వరుస సీట్లను కలిగి ఉంటుంది. పెద్ద ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. టాటా సఫారీ, మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కజార్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతి తన మరో హిట్ మోడల్ బ్రెజ్జాను కూడా అప్‌డేట్ చేస్తోంది. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లను తీసుకురాబోతున్నారు. అలాగే డ్యాష్‌బోర్డ్‌ను మరింత ప్రీమియం మెటీరియల్‌తో డిజైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా మరిన్ని ఎయిర్ బ్యాగ్‌లను జోడించే అవకాశం ఉంది. సిఎన్‌జి వెర్షన్‌లో కారు అడుగు భాగంలో సిలిండర్లు అమర్చి బూట్ స్పేస్ పెంచే కొత్త టెక్నాలజీని కూడా ఇందులో ప్రవేశపెట్టనున్నారు.

మారుతి సుజుకి ప్లాన్ చూస్తుంటే 2026 నాటికి ఎస్‌యూవీ మార్కెట్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని కనిపిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ వంటి మోడళ్లతో ఇప్పటికే మంచి జోరు మీద ఉన్న కంపెనీ, ఇప్పుడు తన ప్రధాన బ్రాండ్లను అప్‌డేట్ చేయడం ద్వారా అమ్మకాలను మరింత పెంచుకోవాలని చూస్తోంది. వచ్చే నెలలో హోండా కూడా ఒక కొత్త కారును భారత్ కు తీసుకురావడానికి సిద్ధమవుతుండటంతో, మారుతి తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను వీలైనంత త్వరగా లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story