Kia Syros EV Price India: సింగిల్ ఛార్జ్‌తో 526 కిమీల మైలేజ్.. రూ. 7.99 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ..!
Kia Syros EV Price India: దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా సరికొత్త విప్లవానికి తెరలేపింది.
Kia Syros EV Price India: సింగిల్ ఛార్జ్‌తో 526 కిమీల మైలేజ్.. రూ. 7.99 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ..!
Kia Syros EV Price India: భారత మార్కెట్లో కియా సిరోస్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 13.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల వరకు ఉంది. మొత్తం 7 విభిన్న వేరియంట్లలో లభించే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) మోడల్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా బ్యాటరీ లేకుండా కారును కేవలం రూ. 7.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ. 3.3 చొప్పున విడిగా వాడకపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రెండు బ్యాటరీ ఆప్షన్లు.. 526 కిలోమీటర్ల అద్భుత రేంజ్..!
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కియా సిరోస్ ఈవీని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో రూపొందించారు. ఇందులో 42 కిలోవాట్ (kWh) బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 51.4 కిలోవాట్ (kWh) బ్యాటరీ వేరియంట్ ఏఆర్ఏఐ ఆమోదిత 526 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 171 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీ కలిగిన మోడల్ నిలబడిన చోటు నుంచి కేవలం 8.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
39 నిమిషాల్లోనే ఛార్జింగ్.. లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ..!
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. 100 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 39 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కియా ఈ కారుతో పాటు ఊహించని ఓనర్షిప్ ప్రయోజనాలను ప్రకటించింది. మొదటి యజమానికి 15 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని ఇస్తోంది. అలాగే కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత కారును తిరిగి విక్రయించేటప్పుడు 80 శాతం రీసేల్ విలువను గ్యారంటీగా ఇచ్చే అస్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొచ్చింది.
30-ఇంచుల డిస్ప్లే.. లెవెల్-2 ఎడాస్ సేఫ్టీ ఫీచర్లు..!
డిజైన్ పరంగా డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 17-ఇంచుల ఏరో అల్లాయ్ వీల్స్, ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో ఈ కారు ఎంతో మోడర్న్‌గా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో 30-ఇంచుల ట్రినిటీ పాన్ రోమిక్ డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ క్లస్టర్, 5-ఇంచుల క్లైమేట్ కంట్రోలర్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, 16 అటానమస్ ఫంక్షన్లు కలిగిన లెవెల్-2 ఎడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లను అమర్చారు.
టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ వంటి ప్రముఖ మోడళ్లకు కియా సిరోస్ ఈవీ బలమైన పోటీగా నిలవనుంది. సుదీర్ఘమైన రేంజ్, అందుబాటు ధరలో వస్తున్న ఈ కారు భారత ఈవీ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




