Kawasaki: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. మార్కెట్లోకి పవర్ఫుల్ 649cc ఇంజిన్‌తో కవాసాకి బైక్
Kawasaki: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ కవాసాకి తన అద్భుతమైన క్రూజర్ బైక్ వాల్కైన్ ఎస్ 2027 అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Kawasaki Vulcan S
Kawasaki: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ కవాసాకి తన అద్భుతమైన క్రూజర్ బైక్ వాల్కైన్ ఎస్ 2027 అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సుదూర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉండే ఈ బైక్‌లో మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఇంజిన్ పనితీరు, కలర్ ఆప్షన్లలో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటోర్ 650 బైక్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ కొత్త వాల్కైన్ ఎస్ మోడల్‌లో 649cc పారలల్-ట్విన్ ఇంజిన్‌ను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే టార్క్‌లో స్వల్ప మార్పులు చేశారు. 2026 వెర్షన్‌లో టార్క్ 1.4ఎన్ఎం తగ్గి 61ఎన్ఎం వద్ద ఉండగా, తాజా 2027 అప్‌డేట్‌తో ఆ టార్క్‌ను మళ్లీ పెంచి 62.4ఎన్ఎం వచ్చేలా చేశారు. దీనివల్ల 2024 మోడల్ లాగే ఇది అద్భుతమైన పుల్ ఇస్తుంది. ఈ ఇంజిన్ 61hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే లాంగ్ రైడ్స్‌లో ఎలాంటి అలసట లేకుండా ప్రయాణించేలా దీని సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది.
బైక్ డిజైన్ మరియు హార్డ్‌వేర్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు లేవు. ఇందులో అనాలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-చానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే బ్రేకింగ్ సిస్టమ్‌లో మాత్రం డిస్క్ డయామీటర్‌ను కొద్దిగా తగ్గించారు. ముందు వైపు 272ఎంఎం డిస్క్ (గతంలో 300ఎంఎం), వెనుక వైపు 216ఎంఎం డిస్క్ (గతంలో 250ఎంఎం) బ్రేక్‌లను అమర్చారు. సస్పెన్షన్ విషయానికొస్తే ముందు భాగంలో 41ఎంఎం ఫోర్క్స్, వెనుక వైపు అడ్జస్టబుల్ ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు.
ఈ కొత్త బైక్ మెటాలిక్ కార్బన్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో తేలికపాటి బ్లూ-గ్రీన్ షేడ్ మెరుపు కనిపిస్తుంది. ఇది మునుపటి బ్లాక్ కలర్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.8.23 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రస్తుత మోడల్ కంటే రూ.10,000 ఎక్కువ. మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటోర్ 650 (రూ.4.05 లక్షలు) నిలుస్తోంది.




