Honda car offers 2026 : హోండా కార్లపై కాసుల వర్షం: ఈ నెలలో కారు కొంటే ఏకంగా రూ.2.12 లక్షల లాభం..!
Honda car offers 2026 : ప్రముఖ జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా, తన కస్టమర్ల కోసం 2026 మే మాసంలో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్లో ఉన్న విపరీతమైన
Honda-offers
Honda car offers 2026 : ప్రముఖ జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా, తన కస్టమర్ల కోసం 2026 మే మాసంలో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకుంటూ, తన విక్రయాలను పెంచుకునే లక్ష్యంతో హోండా ఎలివేట్, హోండా సిటీ , హోండా అమేజ్ వంటి టాప్ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ జేబుకు భారీగా మిగిల్చే ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హోండా ఎలివేట్‌పై ఆకాశమే హద్దుగా ఆఫర్లు
హోండా నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ 'ఎలివేట్' ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. ఈ మే నెలలో ఈ కారును కొనుగోలు చేసే వారికి కంపెనీ గరిష్టంగా ₹2.12 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందులో నేరుగా ₹40,000 నగదు తగ్గింపు లభిస్తుండగా, పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనంగా ₹30,000 వరకు బోనస్ లభిస్తుంది. వీటితో పాటు కార్పొరేట్ ఉద్యోగులకు , ఇప్పటికే హోండా కారు వాడుతున్న వారికి లాయల్టీ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో, అటు మాన్యువల్ ఇటు ఆటోమేటిక్ వేరియంట్లలో లభించే ఈ ఎస్యూవీ ప్రారంభ ధర ప్రస్తుతం ₹11.59 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
హోండా సిటీ.. సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో పాటు భారీ తగ్గింపు
సెడాన్ కార్ల ప్రపంచంలో హోండా సిటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఐదవ తరం మోడల్లో ఉన్న ఈ కారుపై మే నెలాఖరు వరకు ₹1.80 లక్షల వరకు భారీ ప్రయోజనాలు లభిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ కొనే వారికి ₹40,000 క్యాష్ డిస్కౌంట్ , ₹60,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు ఉన్నాయి. దీనికి తోడు వినియోగదారుల నమ్మకాన్ని పెంచేలా ఏడేళ్ల పొడిగించిన వారంటీని (Extended Warranty) కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మే 22న హోండా సిటీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల కానుంది. ఈ కొత్త మోడల్లో ఇంటీరియర్ , ఎక్స్టీరియర్ పరంగా స్టైలిష్ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం.
బడ్జెట్ ధరలో హోండా అమేజ్.. అదిరిపోయే డీల్స్
తక్కువ బడ్జెట్లో ప్రీమియం అనుభూతిని ఇచ్చే హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌పై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తోంది. ఈ నెలలో అమేజ్ కొనేవారు మొత్తం ₹67,000 వరకు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇందులో ₹15,000 నగదు తగ్గింపు , ₹15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ భాగంగా ఉన్నాయి. పాత స్టాక్ లేదా మోడళ్లపై కూడా ₹10,000 వరకు నగదు తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాయల్టీ బోనస్‌లు , ఏడేళ్ల పొడిగించిన వారంటీ ఆప్షన్ ఈ కారును బడ్జెట్ కొనుగోలుదారులకు మరింత లాభసాటిగా మారుస్తోంది. అయితే.. హోండా తన మూడు ప్రధాన మోడళ్లపై ఇస్తున్న ఈ భారీ ఆఫర్లు కొత్త కారు కొనుగోలుదారులకు ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. ఒకవేళ మీరు హోండా ఫ్యామిలీలోకి చేరాలని ఉంటే, ఈ మే నెల మీకు సరైన సమయం కావచ్చు.




