SUV Under 6 Lakh: టాటా పంచ్ నుంచి రెనాల్ట్ కైగర్ వరకు.. 6 లక్షలలోపు బెస్ట్ కార్లు ఇవే.. !
Best SUV Under 6 Lakh: కేవలం 6 లక్షల రూపాయల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, గరిష్ట భద్రత, అద్భుతమైన మైలేజ్ ఇచ్చే వాహనాలు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Best SUV Under 6 Lakh
Best SUV Under 6 Lakh: భారతీయ వాహన రంగంలో వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు ఆశించే వాళ్ల కోసం ప్రముఖ కంపెనీలు పవర్ ఫుల్ ఇంజన్, ఆధునిక సాంకేతికతతో కూడిన వాహనాలను ప్రవేశపెట్టాయి. ఆ జాబితాలో ఏ కార్లు ఉన్నాయో ఓసారి చూద్దాం..
టాటా పంచ్: భద్రతలో నంబర్ వన్..
దృఢమైన, సురక్షితమైన వాహనం కోసం చూస్తున్నట్లయితే టాటా పంచ్ సరైన ఎంపిక. దీని ప్రారంభ ధర సుమారు 5.59 లక్షల రూపాయలు. 5 స్టార్ భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ కారు భారీ ఎస్‌యూవీ అనుభూతిని ఇస్తుంది. దీని మైలేజ్ దాదాపు 27 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్టర్: ఫీచర్ల ఖజానా..
కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి హ్యుందాయ్ ఎక్స్టర్ ఒక అద్భుతం. దీని బేస్ మోడల్ ధర సుమారు 5.80 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగులు ప్రామాణికంగా వస్తాయి. దీని వెనుక సీటు ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఏసీ వెంట్లు కూడా ఉన్నాయి. ఇది నగర ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతమైన వాహనం.
నిస్సాన్ మాగ్నైట్: తక్కువ ధరలో పెద్ద కారు..
చూడటానికి చాలా వెడల్పుగా, ఆకర్షణీయంగా ఉండే నిస్సాన్ మాగ్నైట్ ధర 5.62 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. దీని మైలేజ్ లీటరుకు 19.4 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఈ కారులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అధ్వాన్నమైన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు. తక్కువ బడ్జెట్‌లో విలాసవంతమైన కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
రెనాల్ట్ కైగర్: స్పోర్టీ లుక్, భారీ బూట్ స్పేస్..
యువతను ఆకట్టుకునేలా స్పోర్టీ డిజైన్‌తో రూపొందిన రెనాల్ట్ కైగర్ ధర 5.76 లక్షల రూపాయల నుంచి లభిస్తుంది. ఈ విభాగంలో అన్నిటికంటే ఎక్కువగా 405 లీటర్ల సామాగ్రి ఉంచే సామర్థ్యం (బూట్ స్పేస్) దీని సొంతం. దూర ప్రయాణాలకు, కుటుంబంతో కలిసి వెళ్లడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది.




