Bajaj Pulsar 180 Relaunch: అదరిపోయే రేంజ్‌లో బజాజ్‌ పల్సర్‌ 180 రీ ఎంట్రీ - కళ్లు చెదిరే ఫీచర్లు

Bajaj Pulsar 180 Relaunch: కాలం మారినా… కొన్ని పేర్లు మాత్రం మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బజాజ్ పల్సర్ 180.

Balachander
Published on: 11 April 2026 12:40 PM IST
Bajaj Pulsar 180 Relaunch:
X

Bajaj Pulsar 180 Relaunch

Bajaj Pulsar 180 Relaunch: కాలం మారినా… కొన్ని పేర్లు మాత్రం మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బజాజ్ పల్సర్ 180. ఇప్పుడు ఈ లెజెండరీ బైక్ మళ్లీ కొత్త అవతారంలో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. రూ. 1.22 లక్షల ఎక్స్‌-షోరూమ్ ధరతో విడుదలైన ఈ మోడల్, ఆధునీకతను సొంతం చేసుకొని పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది. ఈ పాత బైక్‌ వినియోగదారుల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని న్యూ బజాజ్‌ పల్సర్‌ 180ని విడుదల చేసినట్టు సంస్థ తెలియజేసింది.

కళ్లు చెదిరే కొత్త ఫీచర్లు

2026 మోడల్‌లో డిజైన్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, ఆకర్షణీయమైన కొత్త గ్రాఫిక్స్ బైక్‌కు మరింత స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్ అందించడం ద్వారా రైడింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మార్చారు. పనితీరు, సౌకర్యం మధ్య సమతుల్యతే ఈ బైక్‌ ప్రత్యేకత. రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉండటమే కాకుండా, స్పోర్టీ ఫీలింగ్‌ను కూడా ఇస్తుంది. 150–160cc బైక్‌ల నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

పల్సర్ 180 చరిత్ర

ఒకప్పుడు పల్సర్ 150, 180 మోడళ్లు విడుదలైనప్పుడు, భారతీయ యువత చూపు మొత్తం బజాజ్ వైపే ఉండేది. మొట్టమొదటి స్పోర్ట్స్ బైక్ అనుభూతిని సామాన్యులకు అందించిన ఘనత ఈ మోడల్‌దే. అందుకే, దీన్ని నిలిపివేసినా... భక్తులు దైవ దర్శనం కోసం వేచి చూసినట్లు, బైక్ రైడర్లు దీని కోసం సోషల్ మీడియాలో నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బైక్‌ రీ ఎంట్రీ అంటే దాన్ని వ్యాపార కోణంలో కంటే లక్షలాది మంది రైడర్ల కోరికకు లభించిన గౌరవంగా చెప్పవచ్చు. ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా… ఈ బైక్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఎప్పుడూ తగ్గలేదు. అందుకే వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని మళ్లీ తీసుకువచ్చింది.

మొత్తంగా చూసుకుంటే, ఈ బైక్‌ రీ ఎంట్రీ అనే కంటే కూడా ఒక లెగసీ తిరిగి ప్రారంభమైందని చెప్పవచ్చు. పాత స్ఫూర్తిని, కొత్త టెక్నాలజీ కలిసిన ఈ పల్సర్ 180, మళ్లీ రోడ్లపై తన ప్రభంజనాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది. కొత్త తరానికి ఇదొక స్టైల్ స్టేట్‌మెంట్‌ అయితే… పాత తరానికి ఇదొక మధుర జ్ఞాపకం అని చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story