Vastu Tips: రాత్రుళ్లు పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా.? బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు త‌ప్పులు ఉండొచ్చు

Vastu Tips: కొంతమందికి తరచూ రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తుంటాయి. దీంతో నిద్ర మధ్యలో మెలకువ రావడం, మరుసటి రోజు అలసట, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి.

Venkata Thirumala
Published on: 3 July 2026 1:55 PM IST
Vastu Tips
X

Vastu Tips: రాత్రుళ్లు పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా.? బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు త‌ప్పులు ఉండొచ్చు

Vastu Tips: కొంతమందికి తరచూ రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తుంటాయి. దీంతో నిద్ర మధ్యలో మెలకువ రావడం, మరుసటి రోజు అలసట, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని శక్తి ప్రవాహం, ముఖ్యంగా బెడ్‌రూమ్ వాస్తు మనసుపై ప్రభావం చూపుతుందని చెబుతారు. కొన్ని వాస్తు పొరపాట్లు పీడకలలకు కారణం కావచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

తలను ఏ దిశలో పెట్టి నిద్రపోతున్నారు?

వాస్తు ప్రకారం ఉత్తర దిశ వైపు తలను పెట్టుకుని నిద్రించడం మంచిది కాదని భావిస్తారు. ఇలా నిద్రిస్తే మానసిక ఆందోళన, నిద్రలో అంతరాయం, పీడకలలు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతారు. అందుకే దక్షిణం లేదా తూర్పు దిశ వైపు తలను పెట్టుకుని నిద్రించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

మంచం కింద చెత్త వస్తువులు ఉంచుతున్నారా?

చాలామంది స్థలం ఆదా చేయడానికి మంచం కింద పాత చెప్పులు, చిరిగిన బట్టలు, తుప్పుపట్టిన ఇనుప వస్తువులు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఉపయోగం లేని ప్లాస్టిక్ సామగ్రి ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం, ఇలాంటి వస్తువులు ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్మకం. దీంతో మనసులో అస్థిరత, ఒత్తిడి పెరిగి నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు పీడకలలు కూడా రావచ్చని చెబుతారు.

బెడ్‌కు ఎదురుగా అద్దం ఉందా?

మీరు నిద్రిస్తున్నప్పుడు మంచం లేదా మీ శరీరం అద్దంలో కనిపించేలా ఉంటే అది వాస్తు దోషంగా భావిస్తారు.

ఒకవేళ అద్దాన్ని వేరే చోటుకు మార్చే అవకాశం లేకపోతే, రాత్రి పడుకునే ముందు దానిని గుడ్డ లేదా కర్టెన్‌తో కప్పాలని వాస్తు నిపుణులు సూచిస్తారు.

బెడ్‌రూమ్‌లో భయపెట్టే చిత్రాలు పెట్టకండి

బెడ్‌రూమ్‌లో హింసాత్మక జంతువుల చిత్రాలు, ముళ్లతో కూడిన మొక్కల ఫొటోలు లేదా భయాన్ని కలిగించే అలంకరణ వస్తువులు ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే మంచాన్ని నేరుగా పైకప్పు బీమ్ కింద ఏర్పాటు చేయడం కూడా మంచిది కాదని భావిస్తారు. ఇలాంటి అమరిక వల్ల మానసిక ప్రశాంతత తగ్గి ఆందోళన, భయం పెరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రశాంతమైన నిద్ర కోసం ఏం చేయాలి?

వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా, గాలి వెలుతురు వచ్చేలా ఉంచడం మంచిదని చెబుతారు. అవసరం లేని వస్తువులు తొలగించడం, సరైన దిశలో నిద్రించడం, అద్దాల స్థానాన్ని సరిచేయడం వంటి చిన్న మార్పులు చేస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. దీంతో ప్రశాంతమైన నిద్రతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: కింద ఇచ్చిన సూచనలు వాస్తు శాస్త్ర విశ్వాసాలపై ఆధారపడినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story