Vastu Tips: స్నానం చేసిన వెంటనే ఇలా చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు
Vastu Tips: స్నానం అనేది కేవలం శరీర శుభ్రత కోసమే కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే ప్రక్రియ కూడా.
Vastu Tips: స్నానం చేసిన వెంటనే ఇలా చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు
Vastu Tips: స్నానం అనేది కేవలం శరీర శుభ్రత కోసమే కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే ప్రక్రియ కూడా. అయితే స్నానం చేసిన తర్వాత తెలియక చేసే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై మాత్రమే కాదు, ఇంటి వాతావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
బాత్‌రూమ్‌లో నీరు ఉంచకండి
చాలామంది స్నానం పూర్తయ్యాక బకెట్‌లో మిగిలిన మురికి నీటిని అలాగే వదిలేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని చెబుతారు. నిల్వగా ఉన్న మురికి నీరు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెంచుతుందని నమ్మకం. అలాగే ఇది దోమలు, బ్యాక్టీరియా పెరగడానికి కూడా కారణమవుతుంది. అందుకే స్నానం అయిన వెంటనే బకెట్‌ను శుభ్రం చేసి తాజా నీటితో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.
బాత్‌రూమ్‌లో ఊడిన జుట్టు వదిలేయడం మంచిది కాదు
తలస్నానం చేసిన తర్వాత ఊడిన వెంట్రుకలను చాలామంది బాత్‌రూమ్‌లోనే వదిలేస్తారు. ఇది పరిశుభ్రతకు విరుద్ధమే కాకుండా వాస్తు పరంగా కూడా అశుభంగా భావిస్తారు. బాత్‌రూమ్‌లో వెంట్రుకలు పేరుకుపోతే ప్రతికూల శక్తులు పెరుగుతాయని కొందరు విశ్వసిస్తారు. అంతేకాదు డ్రైనేజ్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల స్నానం తర్వాత వెంటనే బాత్‌రూమ్‌ను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.
తడి బట్టలను బాత్‌రూమ్‌లోనే ఉంచవద్దు
స్నానం చేసిన వెంటనే తడి బట్టలను బాత్‌రూమ్‌లో పడేయడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల బాత్‌రూమ్‌లో తేమ ఎక్కువవుతుంది. దీని కారణంగా ఫంగస్, దుర్వాసన, బ్యాక్టీరియా పెరుగుతాయి. వాస్తు ప్రకారం కూడా తడి వాతావరణం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతారు. కాబట్టి బట్టలను వెంటనే ఎండలో లేదా గాలి బాగా వచ్చే ప్రదేశంలో ఆరబెట్టడం మంచిది.
స్నానం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదట
వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే తొందరగా సింధూరం పెట్టుకోవడం లేదా పూజా కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెబుతారు. శరీరం, మనసు పూర్తిగా స్థిరపడిన తర్వాతే అలాంటి పనులు చేయాలని సూచిస్తారు. అలాగే చెప్పులు వేసుకుని స్నానం చేయడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు
స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్ తలుపులు మూసేయడం వల్ల లోపల తేమ ఎక్కువసేపు ఉంటుంది. దీని వల్ల గోడలపై బూజు ఏర్పడటమే కాకుండా శ్వాస సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే తడి పాదాలతో బయటకు రావడం వల్ల జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్నానం తర్వాత పాదాలను బాగా తుడుచుకుని బయటకు రావడం అవసరం. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం, ఇంటి వాతావరణం రెండూ మెరుగ్గా ఉంటాయి.




