Astrology: నేటి రాశిఫలాలు - నిరుద్యోగులకు శుభవార్తలు..వ్యాపారులకు లాభాలు

ఆరుద్ర నక్షత్రం, వృద్ధి, ధృవ యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 16 Jun 2026 7:29 AM IST
Astrology: నేటి రాశిఫలాలు - నిరుద్యోగులకు శుభవార్తలు..వ్యాపారులకు లాభాలు
X

Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం శుక్లపక్ష విదియ తిథి రా.12.52 వరకూ తదుపరి తదియ తిథి,ఆరుద్ర నక్షత్రం సా.04.12 వరకూ తదుపరి పునర్వసు నక్షత్రం,వృద్ధి యోగం రా.12.35 వరకూ తదుపరి ధృవం యోగం, బాలవ కరణం మ.02.39 వరకూ, కౌలవ కరణం రా.12.52 వరకూ తదుపరి తైతుల కరణం ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఇక వృద్ధి, ధృవ యోగం కలయిక కారణంగా నిరుద్యోగులు, ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యవసాయం పనులు చురుగ్గా సాగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. ద్వాదశ రాశుల ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆద్యాత్మిక యాత్రలు చేస్తారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒత్తిడిని అధికమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్ధులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవసరమైనా సరే పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయం కాదు. రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండాలి. వివాదాల జోలికి పోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంది. నూతన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది. అయితే, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి పలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. వ్యాపారం అభివృద్ది దిశగా సాగుతుంది. అయితే కుటుంబంలో కొన్ని చీకాకులు ఎదురౌతాయా. వాగ్వాదాలకు పోకూడదు. కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సమయానికి వాటి నుంచి బయటపడతారు. అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కీలక ఒప్పందాలు చేసుకుంటారు.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది.

ధనూరాశి

ఈరోజు ఈరాశివారు ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. కుటుంబంలో మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా వారిని ఒప్పించాలి. తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈరోజు మీరు చెల్లించవలసిన రుణాలను చెల్లించేందుకు ప్రయత్నించాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడుతు పెడతారు. రావలసిన ధనం చేతికి వస్తుంది. స్నేహితుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి కొన్ని అవకాశాలు వస్తాయి. అయితే వాటిని చేజారిపోకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకోవాలి. అదనపు బాధ్యతలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మెళుకువలు అవసరం. పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సాధారణ రాశిఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story